IPL 2026: సన్‌రైజర్స్ ఓటమికి బాధ్యులు ఎవరో చెప్పిన ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: ఐపీఎల్ 2026 తొలి పోరు శనివారం రాత్రి జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిపై ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా బౌలర్ల క్రమశిక్షణ లేని ప్రదర్శనే జట్టు పరాజయానికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు.
READ ALSO: MI Vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. తుది జట్లు ఇవే..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
నియంత్రణ కోల్పోయిన బౌలర్లు..
మ్యాచ్ అనంతరం వెట్టోరి మాట్లాడుతూ.. “మా బౌలింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేదు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడంలో విఫలమయ్యాం. దీనివల్ల ఆర్‌సీబీ బ్యాటర్లు సులువుగా పరుగులు సాధించారు” అని పేర్కొన్నారు. ఆరంభంలోనే ఫిలిప్ సాల్ట్ వికెట్ తీసి ఒత్తిడి పెంచినా, ఆ తర్వాత బౌలర్లు ఆ పట్టును నిలబెట్టుకోలేకపోయారని ఆయన విమర్శించారు. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో విజయాన్ని తమ నుంచి దూరం చేశారని వెట్టోరి ఒప్పుకున్నారు. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ సేవలను ఎస్‌ఆర్‌హెచ్ ఈ మ్యాచ్‌లో బాగా మిస్ అయిందని కోచ్ అన్నారు.
డేవిడ్ పైన్ 3 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, తర్వాత రెండు వికెట్లు తీసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడన్నారు. యువ స్పిన్నర్ హర్ష్ దూబే ప్రదర్శనను వెట్టోరి మెచ్చుకున్నారు. చిన్నాస్వామి వంటి కష్టమైన పిచ్‌పై కూడా అతను నియంత్రణతో బౌలింగ్ చేసి కీలక వికెట్ తీశాడని ప్రశంసించారు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు విఫలమైనా, బ్యాటర్ల పోరాట పటిమను ఆయన కొనియాడారు. 38 బంతుల్లోనే 80 పరుగులతో విధ్వంసం సృష్టించిన ఇషాన్ కిషన్‌ను కోచ్ మెచ్చుకున్నారు. 7వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అనికేత్ వర్మ కేవలం 18 బంతుల్లోనే 43 పరుగులు చేయడం అద్భుతమని వెట్టోరి కొనియాడారు.
READ ALSO: MI vs KKR: నేడే ముంబై ‘తొలి మ్యాచ్’.. ఆ చెత్త రికార్డ్‌ను వాంఖడేలో చెరిపేస్తుందా?
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..