Pushpa 2 : అది క్లిక్కయితే శ్రీలీలను అందుకోవడం కష్టమైన పనే
- ఐటమ్ సాంగ్ క్లిక్ అయితే శ్రీలీలకు తిరుగుండదు
- బాలీవుడ్ అవకాశాలు కూడా వచ్చే ఛాన్స్
- పుష్ప సాంగ్ పై భారీగా హైప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా మిగతా భాషల్లో కూడా భారీ హైప్ తో రానుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ఫస్ట్ పార్టు ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో సమంత చేసిన ఐటెమ్ సాంగ్ కూడా ఒక రేంజ్ లో హిట్ అయింది. ఇక సీక్వెల్ లో ఈసారి స్పెషల్ ఐటమ్ సాంగ్ లో శ్రీలీల కనిపించబోతుంది. ఇప్పటివరకు స్పెషల్ సాంగ్ చేయని అమ్మడు ఈసారి బన్నీ కాంబినేషన్ ను కాదనలేక ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఊహించని విధంగా రెండు కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇక పుష్ప 2 ట్రైలర్లో ఆమె కనిపించిన ఒక్క చిన్న గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందులో ఆమె వేసిన కొన్ని స్టెప్పులు, గ్లామర్ షో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నాయి.
Read Also:Tilak Varma Captain: కెప్టెన్‌గా తిలక్ వర్మ.. టీమ్ ఫుల్ డీటెయిల్స్ ఇవే!
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
ఈ పాటలో ఆమె పాత్ర ఐదు నిమిషాలకంటే తక్కువ సమయం ఉండవచ్చు, కానీ ఆ తక్కువ సమయమే శ్రీలీల కెరీర్‌కి ఊహించని బూస్ట్ లభించే అవకాశం కనిపిస్తుంది. శ్రీలీల హీరోయిన్ గా కంటే టాలీవుడ్లో మంచి డాన్సర్‌గా పేరు తెచ్చుకుంది. అయితే పుష్ప 2 వంటి పెద్ద సినిమాతో ఆమె కెరీర్లో కొత్త అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. సినిమా ట్రైలర్ నుంచే ఆమె ప్రదర్శనపై హైప్ క్రియేట్ కావడం, పాట విడుదల తర్వాత ప్రేక్షకులపై ఆమె మరింత ప్రభావం చూపడం ఖాయమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సాంగ్ తరువాత ఆమె క్లిక్కయితే మాత్రం ఫుల్ బిజీగా మారే అవకాశం ఉంటుంది. అలాగే రెమ్యునరేషన్ కూడా ఒక్కసారిగా డబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీంతో ఆమెను అందుకోవడం మీడియం రేంజ్ నిర్మాతలకు కష్టమే అవుతుంది. అల్లు అర్జున్ పక్కనే డ్యాన్స్ అంటే గ్లామర్ ప్రజెన్స్ ఉపయోగించుకుని హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవచ్చని భావిస్తున్నారు. ఈ సాంగ్ ఆమెకు బాలీవుడ్ అవకాశాలు తెచ్చే అవకాశం కూడా ఉంది.
Read Also:Sivakarthikeyan : 300 వందల కోట్ల మైలురాయి అందుకున్నఅమ’రన్’
ఇప్పటివరకు తెలుగులో తన కెరీర్ కు ఉపయోగపడే విధంగా సక్సెస్ సాధించలేకపోయిన శ్రీలీల, పుష్ప 2లోని ఈ ఐటమ్ సాంగ్ ద్వారా ఊహించని క్రేజ్ అందుకునే ఛాన్స్ ఉంది. సమంత పుష్ప ద్వారా బాలీవుడ్ లో సైతం మంచి అవకాశాలను అందుకుంది. ఇక శ్రీలీల కాస్త ఫోకస్ పెట్టినా కూడా మరో ఐదేళ్ల వరకు ఢోకా ఇండదు. మరి అమ్మడు ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి. ఇక పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు అందుకుంటుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్‌లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!