Site icon NTV Telugu

Pushpa 2 The Rule: ‘సార్’ ఏంటిది అసలు.. టీజర్‌ గురించి చెప్పడానికి పదాలు లేవు!

Sreeleela Anasuya

Sreeleela Anasuya

Sreeleela, Anasuya Bharadwaj on Pushpa 2 The Rule Teaser: సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సినిమా ‘పుష్ప-ది రూల్‌’. 2021లో విడుదలైన ‘పుష్ప-ది రైజ్‌’ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పుష్ప 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. అయితే నేడు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం పుష్ప ది రూల్‌ టీజర్‌ విడుదల చేసింది. మాస్‌ అవతార్‌లో బన్నీ లుక్స్‌, యాక్షన్‌ సన్నివేశాలకు ఫాన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం పుష్ప 2 టీజర్‌ ట్రెండింగ్‌లో ఉంది.

పుష్ప 2 టీజర్‌ చూసిన అభిమానులు గూస్​బంప్స్ వచ్చాయని ట్వీట్స్ చేస్తున్నారు. ఫాన్స్ మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా టీజర్‌ గురించి పోస్టులు పెడుతున్నారు. స్టార్ హీరోయిన్ శ్రీలీల పుష్ప 2 టీజర్‌పై స్పందించారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్ సార్. పుష్ప 2 టీజర్‌ అద్భుతంగా ఉంది. చెప్పడానికి పదాలు లేవు. సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా’ అని శ్రీలీల ట్వీట్ చేశారు. అల్లు అర్జున్‌, శ్రీలీల `ఆహా ఒరిజినల్‌` యాడ్‌ కోసం జతకట్టిన విషయం తెలిసిందే.

Also Read: Allu Arjun Birthday: హ్యాపీ బ‌ర్త్‌డే బావ.. అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపిన స్టార్ హీరో!

పుష్ప 2 టీజర్‌పై నటి అనసూయ భరద్వాజ్ కూడా స్పందించారు. ‘సార్.. ఏంటిది?. ఆహా ఏంటిది అంట?. అలా కాలు తిప్పి.. టైమింగ్‌లో కొంగు పట్టి దూపి.. విడిలించి.. నడుస్తుంటే సార్’ అని అనసూయ ట్వీట్ చేశారు. అలానే పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలిపారు. పుష్ప ది రైజ్‌లో కీలక పాత్ర చేసిన అనసూయ పుష్ప ది రూల్‌లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌పై పార్ట్ 2లో అను పగ తీర్చుకునే సన్నివేశాలు ఉండనున్నాయి.

Exit mobile version