Site icon NTV Telugu

OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్‌ హిట్‌ మూవీ!

Single Movie Ott

Single Movie Ott

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు. సామజవరగమన, ఓం భీమ్‌ బుష్‌, స్వాగ్‌ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఈ ఏడాది ‘సింగిల్‌’ సినిమాతో మరో హిట్‌ అందుకున్నారు. కామెడీ, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సింగిల్‌ సినిమా మే 9న రిలీజ్ అయి.. బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ వేసవిలో శ్రీవిష్ణు తనదైన నటనతో ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించారు. కార్తీక్‌ రాజు దర్శకత్వం వహించిన సింగిల్‌ మూవీలో ఇవానా, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించారు.

Also Read: Gold Price Today: మూడు వేలు పెరిగిన వెండి.. నేడు తులం బంగారం ఎంతుందంటే?

సింగిల్‌ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. థియేటర్లో చూడని వారు ఎంచక్కా ఇంట్లోనే సింగిల్‌ మూవీ చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో విద్య కొప్పినీడి, రియాజ్‌ చౌదరి, భాను ప్రతాప్‌ సంయుక్తంగా నిర్మించారు. సింగిల్‌కు విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించారు.

Exit mobile version