Site icon NTV Telugu

Prabhas-Spirit: ఆ విలనే కావాలి.. ఏంది మావా ఈ రచ్చ?

Spirit Movie Villain

Spirit Movie Villain

Spirit Movie Villain: ఎట్టకేలకు ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న ‘స్పిరిట్’ నుంచి సాలిడ్ అప్డేట్ రావడంతో రెబల్ ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యారు. లేట్‌గా ఇచ్చిన సరే.. స్పిరిట్ సౌండ్ స్టోరీకి పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ వస్తోంది. ఈ ఆడియో గ్లింప్స్‌లో ప్రభాస్ పాత్రకు ఎలివేషన్ ఇస్తూ.. స్టార్ క్యాస్టింగ్ రివీల్ చేశాడు సందీప్. ప్రభాస్ పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కాంచన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక విలన్‌గా బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో స్పిరిట్ విలన్ ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

స్పిరిట్ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. దీంతో ముందు నుంచి ఈ సినిమాలో విలన్‌గా కొరియన్ యాక్టర్ ‘డాన్ లీ’ నటించనున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానికి తోడు ఇన్‌ స్టాగ్రామ్‌‌లో సలార్ పోస్టర్‌ను డాన్‌ లీ షేర్ చేయడంతో ఆయన స్పిరిట్‌లో నటిస్తున్నాడని అంతా ఫిక్స్ అయ్యారు. అక్కడి నుంచి ప్రభాస్ వర్సెస్ డాన్‌ లీ అన్నట్టుగా ఎన్నో ఎడిటెడ్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ భారీ కటౌట్స్ తలపడితే బాక్సాఫీస్ బద్దలవుతుందని ఫాన్స్, నెటిజెన్స్ వైరల్ చేశారు.

కట్ చేస్తే ఇప్పుడు విలన్‌గా స్టార్ క్యాస్టింగ్ పేరులో డాన్ లీ పేరు లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది మాకు ఆ విలనే కావాలన్నట్టు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. డాన్‌ లీ విలన్ అయితే ఇంటర్నేషనల్ రీచ్ ఉంటుందని, ఇప్పటికైనా ఆయనను విలన్‌గా తీసుకోవాలని అంటున్నారు. అయితే స్పిరిట్ స్టార్ క్యాస్టింగ్ ఇక్కడితో అయిపోలేదు. సందీప్ ఏది చేసిన సంచలనమే కాబట్టి.. ఆయన మైండ్‌లో డాన్‌ లీ ఉండే ఉంటాడు. ప్రస్తుతానికైతే స్పిరిట్ విలన్ వివేక్ ఒబెరాయ్ మాత్రమే.

Exit mobile version