పాలకూర లో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అందుకే ఎక్కువగా తింటారు. ఇందులో ఉండే ఫైబర్, ఖనిజలవణాల వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంటుంది. మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఆకుకూరల్లో పాలకూర ఒకటి… రైతులు కూడా వీటి సాగును విపరీతంగా చేస్తున్నారు. అయితే ఆకుకూరలను సాధారణ పంటల్లా ఎక్కువ విస్తీర్ణంలో చేయటం వల్ల లాభం ఉండదు. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా సాగు చేయటం వల్ల మంచి ఆదాయం పొందుతూన్నారు.. ఈ పాలకూర సాగులో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పంటను నీరు నిలిచే భూముల్లో సాగు చేయకపోవటమే మంచిది. మైదాన కొండ. ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చట. మురుగునీరు పోయే సౌకర్యమున్న అన్ని నేలల్లో పాలకూరను సాగు చేయవచ్చు. ఇసుక నేలలు ఒండ్రు. నేలలు. సాగుకు. అత్యంత అనుకూలం. నీటి వసతిని బట్టి సంవత్సరం మొత్తం సీజన్ తో సంబంధం లేకుండా పాలకూర సాగు చేసుకోవచ్చు.. పాలకూర విత్తుకోవడానికి 11 కిలోలు అవసరం అవుతాయి..
పాలకూర సాగుకు అనువైన రకాలు..
జాబనర్ గ్రీన్: ఆకుపచ్చని, దళసరి, మెత్తని ఏకరీతి ఆకులు ఈ రకం ప్రత్యేకం. సువాసన వస్తుంది. ఎకరాకు దిగుబడి 108 క్వింటాళ్లకు పైగా వస్తుందని నిపుణులు అంటున్నారు..
పూసా పాలక్: ఈ రకం పాలకూర పచ్చని మెత్తని ఆకులనిస్తుంది. విత్తే సమయాన్ని బట్టి ఆరుకోతల వరకు తీసుకోవచ్చు. దిగుబడి ఎకరాకు సుమారు 50 క్విటాళ్లు వస్తుందట.
పూసా హరిత్ : ఈ రకం చల్లని ప్రాంతాల్లో సాగుకు అత్యంత అనువైనది. వెడల్పాటి ఆకులు కలిగి ఉంటుంది. త్వరగా విత్తనం ఏర్పడదు. అధిక దిగుబడినిచ్చే రకాల్లో ఇది ఒకటి. విత్తిన 20 రోజుల నుండి ప్రతి 15 రోజలుకు ఒకసారి కలుపు నివారణ, అంతరకృషి చేయాలి. విత్తిన వెంటనే తేలికపాటి నీటి తడులివ్వాలి. మూడో రోజు నుండి 7 రోజులకొకసారి నీటి తడులివ్వాలి. నాటిన 5 నుండి 8వారాల త్వరాత ఆకులు కోతకు సిద్ధం అవుతాయి..
ఆకు కూరల్లో తెగుళ్లు ఎక్కువగానే ఉంటాయి.. పాలకూరలో కూడా అంతే..పాలకూరలో పేను బంక , రసం పీల్చే పురుగుల బెడద ఎక్కవగా ఉంటుంది. ఇవి సోకితే.. ఆకులు ముడుతలు పడి మొక్కలు చనిపోతాయి. పొలంలో వీటిని గుర్తించిన వెంటనే 2గ్రా మలాథియాన్, ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి..ఆ తర్వాత వారం రోజులకు ఆకులను కోయాలి..