బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నవారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా, 127 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. పోస్ట్ ప్రకారం వివిధ అర్హతలు నిర్ణయించారు. అభ్యర్థి పోస్ట్ ప్రకారం సంబంధిత రంగంలో ఇంజనీరింగ్ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్/ CA/ CMA/ ICWA/ CFA/ MBA మొదలైనవి చేసి ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, గరిష్ట వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ా
Also Read:Dhanush: ఇడ్లీ కొట్టు ఆడియో లాంచ్‌లో..చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ధనుష్
రిజర్వ్డ్ కేటగిరీ నుండి వచ్చే అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 1000 రుసుము చెల్లించాలి. SC, ST, PH కేటగిరీ అభ్యర్థులు కేవలం రూ. 175 దరఖాస్తు రుసుము చెల్లించాలి. అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 12 నుండి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 03 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.