NTV Telugu Site icon

BRS : మరోసారి బయటపడ్డ జగిత్యాల బీఆర్‌ఎస్‌లోని విభేదాలు

Brs

Brs

జగిత్యాల బీఆర్ఎస్ లో ముసలం తారా స్థాయికి చేరింది. మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు బయటపడ్డాయి. ఏకంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర మైన ఆరోపణలు చేస్తూ మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి పదవికి రాజీనామా చేయడం ఎమ్మెల్యే అవమానించారని కన్నీరు పెట్టడం సంచలనంగా మారింది. అయితే ఇదంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసమే అనే చర్చ సైతం జరుగుతోంది.. బోగ శ్రావణి దంపతులు రహస్యంగా బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తూ తమ అనుచరులతో బలాబలాలపై చర్చలు చేస్తున్నారని ప్రచారం జరిగింది.. ఛైర్ పర్సన్ శ్రావణి రాజకీయ ప్రయాణాలు పసి గట్టిన ఎమ్మెల్యే సంజయ్ ఆదిలోనే ఆమెకు చెక్ పెట్టేందుకు తన అనుకూల కౌన్సిలర్లుతో లేఖ రాపించినట్లు చర్చ నడుస్తోంది..

Also Read : Lucknow Building Collapse: లక్నోలో కూలిన భవనం.. ఎస్‌పీ నేత తల్లి, భార్య దుర్మరణం

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి మధ్య గత కొంతకాలంగా అంతర్గత విభేదాలు నెలకొన్నాయి.. మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చైర్ పర్సన్ శ్రావణిని పట్టించుకోకుండా పక్కన బెడుతున్నారని తన అనుచరులతో చైర్ పర్సన్ చెప్పుకున్నారు.. ఇదే సమయంలో మాస్టర్ ఫ్లాన్ వివాదం తెరపైకి రావడం ప్రజలకు అవగాహన కల్పించలేకపోవడం రైతులకు ముసాయిదా గురించి చెప్పడంలో చైర్ పర్సన్ విఫలం అయిందని కొంత మంది కౌన్సిలర్ లు కౌన్సిల్ మీటింగ్లో బహిరంగ ఆరోపణలు చేశారు..అయితే ఎమ్మెల్యే కూడా టైం కోసం వేచి చూస్తున్నారు.. ఆరునెలలుగా శ్రావణి టికెట్ రేసులో ఉందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం అవ్వడం ఎమ్మెల్యే కు ఇబ్బంది గా మారింది..అంతే కాకుండా శ్రావణి దంపతులు ఇంటి ఇంటికి వెళ్లి అభిప్రాయ సేకరణ చేయడం ఎమ్మెల్సీ కవితను పలుమార్లు కలవడం చేస్తున్నారు..

Also Read : Ambati Rambabu: పవన్ ఎంటర్ టైనర్ మాత్రమే.. జగన్ జనం మనసు గెలిచిన ధీరుడు

జగిత్యాల సెగ్మేంట్ లో పద్మశాలి సామాజిక వర్గ ఓట్లు కీలకంగా 20 వేలు నుండి 30 వేలు వరకూ ఓట్లు ఉన్నాయి..చైర్ పర్సన్ శ్రావణి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో తమ అనుకూల ఓట్లపై దృష్టి పెట్టి సర్వేలు సైతం చేపించారు.. గతంలో జగిత్యాలలో ఎల్ రమణ బిసి సెంటి మెంట్ తోనే గెలిచారు.. ఇప్పుడు శ్రావణి కూడా బిసి నినాదాన్ని తెరపైకి తెచ్చింది.. దీంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శ్రావణిల మధ్య గ్యాప్ మరింత పెరిగింది..వివిధ మీడియాలలో శ్రావణి టికెట్ రేసులో ఉందంటూ కథనాలు ప్రసారం అయ్యాయి.దీంతో ఎమ్మెల్యే సంజయ్ జోక్యం చేసుకుని టికెట్ రేసులో లైనని బోగ శ్రావణి చెప్పాలని హుకుం జారీ చేశారట.శ్రావణి అందుకు ఒప్పుకోక పోవడంతో సంజయ్ మరింత ఆగ్రహానికి గురయ్యాడు..గత నాలుగు రోజుల క్రితం 27 మంది కౌన్సిలర్లు బోగ శ్రావణి మున్సిపల్ చైర్ పర్సన్ వద్దంటూ ఎమ్మెల్యే సంజయ్ కు లేక రాసారు..

ఆ లేక తర్వాత కూడా కౌన్సిలర్లు చైర్మన్ లలో మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఇక ఎమ్మెల్యే తో కలిసి పనిచేయడం కష్టం అంటూ రెండు రోజుల క్రితం అనుచరులతో సమావేశం అయింది శ్రావణి..రాజీనామా చేయాలని తీర్మానించుకున్నాక రాజీనామా ప్రకటన చేసింది.అయితే సంజయ్ వర్గీయులు మాత్రం శ్రావణి వేరే పార్టీతో టచ్ లో ఉండి విభేదాలు సృష్టించిందని విమర్శలు చేస్తున్నారు.. పథకం ప్రకారమే పార్టీని డ్యామేజ్ చేసేందుకు ఇదొక డ్రామా అంటూ సంజయ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు మరో పది నెలల ముందు జగిత్యాల బీఆర్ఎస్‌ లో వర్గాల బెడతతో కార్యకర్తలకు తలనొప్పిగా మారింది.. అయితే శ్రావణి ఆరోపణలు పై.సంజయ్ సమాధానం ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు..