NTV Telugu Site icon

Palnadu: పల్నాడులో కొనసాగుతున్న అల్లర్ల కేసుల విచారణ

Sit

Sit

Palnadu: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 13 మంది సభ్యులతో కూడిన సిట్‌ బృందం విచారణ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల తీరుపై విచారిస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) శనివారం క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగింది. ఇంటెలిజెన్స్‌ ఐజీ వినీత్‌ బ్రిజిలాల్‌ నేతృత్వంలో 13మంది అధికారులతో ఏర్పాటైన సిట్‌ నాలుగు బృందాలుగా విడిపోయి ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రితోపాటు తిరుపతిలో సిట్‌ అధికారులు పర్యటిస్తున్నారు.

Read Also: Loksabha Elections : ఐదో దశలో 49 స్థానాలకు పోలింగ్.. బరిలో రాహుల్, స్మృతి, రాజ్‌నాథ్‌

పల్నాడులో అల్లర్ల కేసుల విచారణ కొనసాగుతోంది. నేడు పల్నాడులో సిట్ బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపే అవకాశం ఉంది. , వెల్దుర్తి ప్రాంతాల్లో సిట్ బృందం విచారణ చేయనుంది. గురజాల నియోజకవర్గంలో వందకు పైగా కేసులు.. 192 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు.. అత్యధికంగా దాచేపల్లి మండలం 70, పిడుగురాళ్ల మండలం 62 మందిపై కేసులు నమోదైనట్లు సిట్ విచారణలో తెలిసింది. పిడుగురాళ్ల మండలంలో 67 మందిపై ఐపీసీ 307, 324, 323 కింద కేసు నమోదైంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు..దాదాపు 70 మంది నిందితులను గుర్తించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 5 కేసులు నమోదు కాగా.. 99 మంది నిందితులను గుర్తించారు. నరసరావుపేట నియోజకవర్గంలో 20 పైగా కేసు నమోదు కాగా.. 60 మంది నిందితులను గుర్తించారు. నరసరావుపేట వన్ టౌన్‌లో జరిగిన గొడవలకు సంబంధించి 11 మందిపై ఐపీసీ 147, 148, 324 కింద కేసు నమోదైంది. నరసరావుపేట రెండవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో, పదికి పైగా కేసులు నమోదు కాగా.. పోలింగ్ రోజున చెలరేగిన హింస లో నిందితుల గుర్తింపు కోసం సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్‌లు నమోదైన నిందితులతో పాటు వీడియోల ఆధారంగా మరికొన్ని పేర్లు చేర్చే అవకాశం ఉంది.