వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని మొగ్గిలిగుండ్ల గ్రామలల్లో వింత పరికరం ఆకాశం నుండి పడింది. అయితే.. ఈ పరికరానికి చుట్టు కెమరాలతో ప్యారచూట్‌ను పోలి ఉంది. దీంతో.. దీన్ని చూసేందుకు గ్రామస్తులులతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలనికి వెళ్లి పరిశీలిస్తున్నారు. మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ప్రత్యక్షమైన వింత శకటం పడిందని.. చూడటానికి ఆదిత్య 369సినిమాలో మాదిరిగా గుండ్రంగా ఉందంటూ ప్రచారం సాగుతుండటంతో దీన్ని చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు.
Also Read : Digital Payments : వాడకం అంటే ఇది.. డిజిటల్ పేమెంట్సా మజాకా..!
ఎక్కడ నుంచో వచ్చి పంటపోలాల్లో పడిందోనని, వింతగా గ్రామస్తులు చూస్తున్నారు. అంతేకాకుండా.. ఎక్కాడి నుంచి వచ్చిపడిందో ఎంటోనని కొందరు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటన స్థలానికి తహసీల్దార్ చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే.. ఇదిలా ఉంటే.. వాస్తవానికి అది స్పేస్ బెలూన్ ఫ్లైట్.. అంతరిక్షంలో ప్రయాణించేందుకు.. అంతరిక్ష యాత్రలు చేసేందుకు వివిధ కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నారు. బెలూన్ ఆకారంలో ఉంటే ఈ భారీ బెలూన్ లో జనం స్పెస్‌లోకి వెళ్లి అంతిరిక్ష యాత్ర చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి పలు కంపెనీలు. అయితే.. చూడాలి మరి.. ఈ మన దేశానికి చెందిన స్పేష్ బెలూన్ ఫ్లైట్ హా.. లేకుంటే వేరే దేశానికి చెందినదా..? అని.