NTV Telugu Site icon

Palnadu SP: ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు..

Palnadu

Palnadu

Palnadu: పల్నాడు జిల్లాను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు అంటూ పేర్కొనింది. పల్నాడు ప్రాంతానికి మంచి పేరు ఉంది, దానిని మీరు చెడగొట్టొద్దు అని చెప్పుకొచ్చింది. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. అలాగే, కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడం, తగలబెట్టడం లాంటివి జరిగితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చింది. పోలీసులు అంటే ఎవరికీ భయం లేదు.. మరోసారి జిల్లాలో అల్లర్లు జరిగితే పోలీసులు అంటే ఏంటో చూపిస్తామని చెప్పారు.. మొత్తం జిల్లా అంతా అరాచకంగా ఉంది.. మంచి జిల్లాగా మారడానికి మనకు అవకాశం ఉంది అని ఎస్పీ మాల్లిక గార్గ్ వెల్లడించారు.

Read Also: Aa Okkati Adakku OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆ ఒక్కటి అడక్కు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

పల్నాడులో నెలకొన్న పరిస్థితులపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. గొడవలకు పాల్పడేది ఎవరినైనా సహించేది లేదని జిల్లా ఉన్నతాధికారులు తేల్చి చెబుతున్నారు. కౌంటింగ్ ప్రక్రియను సీరియస్ గా తీసుకున్నాం.. పల్నాడులో జూన్ 2 నుంచి 5వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు షాపులు బంద్ చేయాలని వ్యాపార వర్గాలకు ఎస్పీ మల్లిక గార్గ్ సూచించారు. పల్నాడులో గడిచిన 18 రోజులుగా 144 సెక్షన్ కొనసాగుతుంది.. మరోవైపు గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ లు చేస్తున్నాం.. కౌంటింగ్ రోజున అల్లర్లకు పాల్పడితే ఆ అల్లర్లను ప్రోత్సహించిన నాయకులు ఎవరినైనా వదిలేది లేదని జిల్లా ఎస్సీ మల్లిక గార్గ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

Read Also: Monke Surgery: తొలిసారి కోతికి కంటిశుక్లం శస్త్రచికిత్స.. ఏమైందంటే..!

అయితే, మీరు చేసే తప్పులు మీ పిల్లల పైన పడతాయని జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ హెచ్చరికలు జారీ చేశారు. కేసుల్లో ఇరుక్కుంటే, రౌడీషీట్లు ఓపెన్ చేస్తే, భవిష్యత్తులో ఉద్యోగాలు రావు, విదేశాలకు వెళ్ళటానికి అవకాశం లేకుండా పోతుందని వార్నింగ్ ఇచ్చింది. ప్రశాంత వాతావరణంలో పల్నాడు జిల్లాలో కౌంటింగ్ జరగాలి.. ప్రజలతో పాటు క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు తమకు సహకరించాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.