మలక్ పేటలో ఉదయం వాకింగ్ కు వెళ్లిన చందునాయక్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను సౌత్ ఈస్ట్ డిసిపి సాయి చైతన్య వెల్లడించారు. సాయి చైతన్య ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. “పాత కక్షల కారణంగా చందు నాయక్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.. ఉదయం 7:30 గంటలకు కాల్పుల ఘటన జరిగింది.. చందు నాయక్ పై గుర్తు తెలియని దుండగులు శాలివాహన పార్క్ వెస్ట్ సైడ్ గెట్ సమీపంలో కాల్పులు జరిపారు.. చందు నాయక్ (47) సిపిఐ పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఉన్నాడు.
Also Read:YSRCP: తాడిపత్రిలో వైసీపీ సమావేశం తాత్కాలికంగా వాయిదా.. కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు!
ఉదయం రెక్కీ నిర్వహించిన దుండగులు స్విఫ్ట్ కారులో వచ్చారు.. స్పాట్ లో మాకు తుపాకీ 2 empty sheles & fire చేసిన 3 బుల్లెట్స్ దొరికాయి.. 1 తుపాకీ వాడినట్లు తెలుస్తుంది.. మూడు రౌండ్ కాల్పులు జరిపారు.. 2 ఆన్ ఫైర్ రౌండ్ షేల్ లభించాయి.. 10 పోలీస్ టీమ్స్ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాము.. నలుగురు వ్యక్తులు స్విఫ్ట్ కారులో వచి కాల్పులు జరిపి ఎస్కేప్ అయ్యారు.. ఎల్ బీ నగర్ లో చందు నాయక్ 2022 లో ఓ హత్య కేసులో ప్రమేయం ఉంది.. మరో కేసుపై దర్యాప్తు చేస్తున్నాము.. చందు నాయక్ కు ప్రాణ హాని ఉందని ఇప్పటివరకు పోలీస్ లకు ఫిర్యాదు చేయలేదు.. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించాం.. స్పాట్లో దొరికిన బుల్లెట్లను చూస్తే ఒకే వెపన్తో ఫైరింగ్ చేసినట్టు ఉన్నాయి..
Also Read:IB Executive Recruitment 2025: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 జాబ్స్.. ఈ అర్హతలుంటే అస్సలు వదలొద్దు
స్పాట్ లో ఉన్న సీసీ కెమెరాలతో పాటు సరౌండింగ్ లో ఉన్న కెమెరాలు ఫుటేజ్ ను పరిశీలిస్తున్నాము.. చందు నాయక్ నాగోల్ సాయి నగర్ లో గుడిసెలు వేయించేవాడు.. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.. అతి త్వరలో నిందితులను పట్టుకొని కేసును చేదిస్తాం.. నిందితులు ఉపయోగించిన కారును గుర్తించాము” అని తెలిపారు. ఈ క్రమంలో మలక్ పేట కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు లొంగిపోయారు.. ఎస్వోటీ పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితులు రాజేష్, శివతో పాటు మరో ఇద్దరు. మృతుడు చందు నాయక్ తో పాటు నలుగురు నిందితులు ఓ హత్య కేసులో నిందితులు.. ఐదుగురి మధ్య ఆర్థిక లావాదేవీలే చందు నాయక్ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.
