NTV Telugu Site icon

IND vs SA: తెలుగోడి దెబ్బకి విలవిలాడిన దక్షిణాఫ్రికా బౌలర్లు.. సెంచరీతో అదరగొట్టిన తిలక్ వర్మ

Ind Vs Sa (1)

Ind Vs Sa (1)

IND vs SA: సెంచూరియన్‌ వేదికగా భారత్ – దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ సెంచరీతో దక్షిణాఫ్రికా బౌలర్లను చితకబాదాడు. మరోవైపు వరుస వికెట్లు పడిపోతున్న తాను మాత్రం సిక్సర్లతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొదటి ఓవర్ రెండో బంతికే సంజు శాంసన్ డకట్ కాగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ మొదటి నుంచే అటాకింగ్ గేమ్ మొదలు పెట్టాడు. ఈ నేపథంలో తిలక్ వర్మతోపాటు అభిషేక్ శర్మ కూడా తనవంతు సహకారాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ రెండో వికెట్ కి 107 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత అభిషేక్ శర్మ 24 బంతులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తరువాత బాల్ కు వెనురిగాడు. దీంతో పార్ట్నర్షిప్ కు బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్కరు తిలక్ వర్మకు పెద్దగా సపోర్ట్ అందించలేదు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.

Also Read: Online Games Banned: ఆన్‌లైన్ గేమింగ్‌కు వ్యతిరేకంగా కేంద్ర మాజీ మంత్రి ప్రచారం, కఠినమైన చట్టం అవసరమంటూ..

ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన తిలక్ వర్మ తన టీ20 కెరియర్లో మొదటి సెంచరీని నమోదు చేశాడు. 51 బంతుల్లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. మొత్తానికి తిలక్ వర్మ 56 బంతులతో 107 పరుగులు చేశాడు. ఇక టీమిండియా బ్యాటింగ్లో అభిషేక్ శర్మ 50, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 1, హార్థిక్ పాండ్యా 18, రింకు సింగ్ 8 తక్కువ పరుగులకే అవుట్ కావడంతో నిరాశపరిచారు. చివరిలో మొదటి మ్యాచ్ ఆడుతున్న రామన్దీప్ సింగ్ తాను ఆడిన మొదటి బంతికే సిక్స్ కొట్టాడు. చివరికి 6 బంతుల్లో 15 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు. మరోవైపు వైపు దక్షిణాఫ్రికా బౌలర్లు.. అందిలే సిమెలనే, కేశవ్ మహారాజ్ లు చెరో రెండు వికెట్లు తీసుకోగా, మార్కో జాన్సెన్ ఒక వికెట్ ను తీసుకున్నాడు.

Show comments