Site icon NTV Telugu

Sourav Ganguly: మరోసారి సౌరవ్ గంగూలీ పోటీ.. ఈసారి కూడా ఏకగ్రీవమేనా!

Sourav Ganguly

Sourav Ganguly

Sourav Ganguly to Contest for CAB President Again: టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ మరోసారి భారత క్రికెట్ బోర్డులో తన ప్రభావం చూపడానికి సిద్దమవుతున్నారని తెలుస్తోంది. త్వరలో జరగనున్న బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్ష పదవికి దాదా పోటీ చేస్తున్నారని సమాచారం. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని మూడేళ్లు కావొస్తున్న నేపథ్యంలో క్యాబ్ అధ్యక్ష పదవికి గంగూలీ పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్యాబ్ ఎన్నికల్లో దాదా ఏకగ్రీవంగా ఎన్నికవుతాడా? లేదా పోటీ ఎదుర్కొంటాడా? అనేది చూడాలి.

సౌరవ్ గంగూలీ తన రిటైర్మెంట్ అనంతరం 2014లో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. క్యాబ్‌లో దాదా తన మార్క్ చూపించారు. దాంతో 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐపై ఈ బెంగాల్ టైగర్ తనదైన ముద్ర వేశారు. లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం.. మూడేళ్ల కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ తప్పనిసరి. కాబట్టి గంగూలీ ప్రస్తుతం ఏ పదవిలో లేరు. 1983 ప్రపంచకప్ హీరో రోజర్ బిన్నీ ఇప్పుడు బీసీసీఐ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నారు.

Also Read: Sourav Ganguly: భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదు.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు!

52 ఏళ్ల సౌరవ్ గంగూలీ ఇప్పుడు మరలా క్రీడా పరిపాలనలో అడుగుపెపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్యాబ్‌ అధ్యక్ష పదవికి దాదా పోటీ పడటం ఖాయమే అని సమాచారం. ప్రస్తుతం గంగూలీ సోదరుడు స్నేహాశీష్‌ గంగూలీ క్యాబ్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆరేళ్లుగా పదవిలో కొనసాగుతుండటంతో.. మూడేళ్ల కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే దాదా క్యాబ్‌ అధ్యక్షుడిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. గంగూలీ భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడారు.

 

Exit mobile version