Site icon NTV Telugu

Sourav Ganguly: ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రోహిత్, విరాట్ వన్డేల నుంచి రిటైర్ అవుతారా?.. క్లారిటీ ఇచ్చిన గంగూలీ

Kohli

Kohli

భారత జట్టు మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ అక్టోబర్‌లో జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో తమ కెరీర్‌లోని చివరి వన్డే సిరీస్ ఆడవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చారు. వారిద్దరూ బాగా రాణిస్తే ఈ ఫార్మాట్‌లో ఆడటం కొనసాగించాలని ఆయన తెలిపారు.

Also Read:Air India: కొత్త సీట్లు, కర్టెన్ల నుంచి టాయిలెట్ల వరకు.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ రూపురేఖలు మారనున్నాయ్!

అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటన తర్వాత, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల నుంచి రిటైర్ కావచ్చని కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనున్నాయి. నివేదికల ప్రకారం, 2027 ప్రపంచ కప్ కోసం స్ట్రాటజీలో భారత జట్టు యాజమాన్యం రోహిత్, విరాట్‌లను పరిగణనలోకి తీసుకోవడం లేదు. వన్డే జట్టులో కొనసాగాలంటే ఇద్దరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సి రావచ్చు.

Also Read:70mm Entertainments: ఆరు స్క్రిప్టులు లాక్.. .. రెండేళ్లలో సినిమాలు రిలీజ్ చేస్తామన్న నిర్మాణ సంస్థ

రోహిత్, విరాట్ వన్డేల నుంచి రిటైర్మెంట్ గురించి సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. నాకు తెలియదు, దానిపై నేను కామెంట్ చేయలేను’ అని అన్నారు. ఎవరు బాగా రాణిస్తారో వారు ఆడటం కొనసాగించాలి. రోహిత్ శర్మ, కోహ్లీ వన్డే రికార్డు అద్భుతంగా ఉందన్నారు. భారత్ -ఆస్ట్రేలియా వన్డే పర్యటన అక్టోబర్ 19న ప్రారంభమవుతుంది. పెర్త్, అడిలైడ్, సిడ్నీలలో మ్యాచ్‌లు జరగనున్నాయి. దీని తర్వాత డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో మూడు స్వదేశీ వన్డేలు ఆడనుంది.

Exit mobile version