Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Sourabh Chandrakar Spent Rs 200 Cr On Lavish Uae Wedding Kin Flown In From Nagpur In Private Jets

Mahadev Gambling App: UAEలో పెళ్లి కోసం రూ. 200 కోట్ల ఖర్చు.. బట్టబయలు చేసిన ఈడీ

Published Date :September 15, 2023 , 4:56 pm
By Rajesh Veeramalla
Mahadev Gambling App: UAEలో పెళ్లి కోసం రూ. 200 కోట్ల ఖర్చు.. బట్టబయలు చేసిన ఈడీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహాదేవ్ యాప్‌కు సంబంధించి సుమారు రూ. 5000 కోట్ల మనీ లాండరింగ్‌పై దర్యాప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. సూత్రధారి సౌరభ్ చంద్రకర్ విషయాలను బట్టబయలు చేశారు. అతను ఏ విధంగా మోసాలకు పాల్పడి ఎలా ఆనందించాడో అని వివరించారు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకారం.. సౌరభ్ యుఏఇలో వివాహం చేసుకున్నాడు. అందుకు దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేశాడు. అంతేకాకుండా.. ఆ పెళ్లికి హాజరయ్యేందుకు ఆయన కుటుంబ సభ్యులు నాగ్‌పూర్ నుంచి ప్రైవేట్ జెట్‌లలో వచ్చారు.

Drug Case : రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసు.. నవదీప్‌కు నోటీసులు..?

వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఈడీ కేసు దర్యాప్తు ప్రారంభించగా.. గత నెలలో నలుగురిని అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన చంద్రకర్, రవి ఉప్పల్ అనే జూదం యాప్ ‘మహదేవ్’ని నడుపుతున్న ప్రధాన వ్యక్తులు అని విచారణలో తేలింది. దుబాయ్‌లో కూర్చొని ఈ యాప్ ను నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా.. సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ UAEలో స్థిరపడి ఈ దందా చేస్తున్నారు. మరోవైపు సౌరభ్.. 2023 ఫిబ్రవరిలో UAEలోని RAKలో వివాహం చేసుకున్నారు. మహాదేవ్ యాప్ యాజమాన్యం పెళ్లి వేడుకకు రూ.200 కోట్ల నగదు ఖర్చు చేసింది. కుటుంబాన్ని నాగ్‌పూర్ నుంచి యూఏఈకి తీసుకెళ్లేందుకు ప్రైవేట్ విమానాలను అద్దెకు తీసుకున్నాడు. పెళ్లి అలంకరణల నుంచి డ్యాన్సర్ల వరకు ముంబై నుంచి రవాణా చేసి హవాలా ద్వారా నగదు చెల్లించారు.

Xiaomi: దిగొచ్చిన చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ.. సరసమైన ధరలో 5G మొబైల్ ప్రైస్..!

మహదేవ్ యాప్ వ్యవహారంపై.. రాయ్‌పూర్, భోపాల్, ముంబై, కోల్‌కతా సహా దేశవ్యాప్తంగా 39 చోట్ల ఈడీ దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో రూ.417 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. అంతేకాకుండా.. చంద్రాకర్, ఉప్పల్ లపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. రాయ్‌పూర్‌లోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మహదేవ్ ఆన్‌లైన్ బుక్‌ను 70:30 లాభ నిష్పత్తి ప్రకారం UAE కార్యాలయం నుండి ఫ్రాంచైజీ ద్వారా నడుపుతున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి యాప్, వెబ్‌సైట్‌ను ప్రచారం చేయడానికి భారతదేశంలో కూడా పెద్ద మొత్తంలో నగదు ఖర్చు చేశారు. దాని కోసం పలువురు ప్రముఖులు ప్రచారం చేశారని, వారి కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చారని.. అందుకు ప్రతిఫలంగా వారికి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారని రైడ్‌లో వెల్లడైంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ED
  • Mahadev Gambling App
  • Sourabh Chandrakar
  • telugu news
  • UAE

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions