మహాదేవ్ యాప్‌కు సంబంధించి సుమారు రూ. 5000 కోట్ల మనీ లాండరింగ్‌పై దర్యాప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. సూత్రధారి సౌరభ్ చంద్రకర్ విషయాలను బట్టబయలు చేశారు. అతను ఏ విధంగా మోసాలకు పాల్పడి ఎలా ఆనందించాడో అని వివరించారు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకారం.. సౌరభ్ యుఏఇలో వివాహం చేసుకున్నాడు. అందుకు దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేశాడు. అంతేకాకుండా.. ఆ పెళ్లికి హాజరయ్యేందుకు ఆయన కుటుంబ సభ్యులు నాగ్‌పూర్ నుంచి ప్రైవేట్ జెట్‌లలో వచ్చారు.
Drug Case : రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసు.. నవదీప్‌కు నోటీసులు..?
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఈడీ కేసు దర్యాప్తు ప్రారంభించగా.. గత నెలలో నలుగురిని అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన చంద్రకర్, రవి ఉప్పల్ అనే జూదం యాప్ ‘మహదేవ్’ని నడుపుతున్న ప్రధాన వ్యక్తులు అని విచారణలో తేలింది. దుబాయ్‌లో కూర్చొని ఈ యాప్ ను నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా.. సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ UAEలో స్థిరపడి ఈ దందా చేస్తున్నారు. మరోవైపు సౌరభ్.. 2023 ఫిబ్రవరిలో UAEలోని RAKలో వివాహం చేసుకున్నారు. మహాదేవ్ యాప్ యాజమాన్యం పెళ్లి వేడుకకు రూ.200 కోట్ల నగదు ఖర్చు చేసింది. కుటుంబాన్ని నాగ్‌పూర్ నుంచి యూఏఈకి తీసుకెళ్లేందుకు ప్రైవేట్ విమానాలను అద్దెకు తీసుకున్నాడు. పెళ్లి అలంకరణల నుంచి డ్యాన్సర్ల వరకు ముంబై నుంచి రవాణా చేసి హవాలా ద్వారా నగదు చెల్లించారు.
Xiaomi: దిగొచ్చిన చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ.. సరసమైన ధరలో 5G మొబైల్ ప్రైస్..!
మహదేవ్ యాప్ వ్యవహారంపై.. రాయ్‌పూర్, భోపాల్, ముంబై, కోల్‌కతా సహా దేశవ్యాప్తంగా 39 చోట్ల ఈడీ దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో రూ.417 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. అంతేకాకుండా.. చంద్రాకర్, ఉప్పల్ లపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. రాయ్‌పూర్‌లోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మహదేవ్ ఆన్‌లైన్ బుక్‌ను 70:30 లాభ నిష్పత్తి ప్రకారం UAE కార్యాలయం నుండి ఫ్రాంచైజీ ద్వారా నడుపుతున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి యాప్, వెబ్‌సైట్‌ను ప్రచారం చేయడానికి భారతదేశంలో కూడా పెద్ద మొత్తంలో నగదు ఖర్చు చేశారు. దాని కోసం పలువురు ప్రముఖులు ప్రచారం చేశారని, వారి కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చారని.. అందుకు ప్రతిఫలంగా వారికి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారని రైడ్‌లో వెల్లడైంది.