NTV Telugu Site icon

Sony Xperia 5 V: మార్కెట్లోకి రానున్న సోనీ ఎక్స్‌ పీరియా 5 వీ.. ఫీచర్లు ఇవే

Sony

Sony

Sony Xperia 5 V: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సోనీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లను తీసుకువస్తూ తన వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా సోనీ ఎక్స్ పీరియా 5 వీ(Sony Xperia 5 V)ను ఆవిష్కరించనుంది. ఈ ఫోన్ ను సెప్టెంబర్ 1 న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ వీడియోను సెప్టెంబర్ 1 శుక్రవారం జపాన్ సమయం ప్రకారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. అయితే ఈ ఫోన్ కు సంబంధించిన ప్రోమో వీడియో నెల రోజుల క్రితమే లీక్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అది నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Also Read: Crackers Factory Blast: బెంగాల్‌లో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఏడుగురు మృతి

గతేడాది సెప్టెంబర్ లో సోనీ ఎక్స్ పీరియా 5 IV ని విడుదల చేశారు. ఇప్పుడు సరిగ్గా ఏడాదికి సోనీ ఎక్స్ పీరియా 5 వీ ని కంపెనీ ఆవిష్కరించనుంది. ఇక దీనిలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాసెసర్ విషయానికి వస్తే డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తున్నట్లుగా తెలుస్తోంది. గొరిల్లా గ్లాస్ 6 డిస్ ప్లే ప్రొటెక్షన్ తో బ్యాక్ సైడ్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఇది అందుబాటులోకి రానుంది. ఇక ఇది బ్లాక్, గ్రే, బ్లూ, పింక్ కలర్లలో లభించనున్నట్లుగా తెలుస్తోంది. దీని డిస్ ప్లే 6.3 ఇన్ చ్ ఉండనుంది. 128 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉండనుంది. ఇక దీని ధర విషయానికి వస్తే రూ. ₹79,990గా ఉండవచ్చని అనుకుంటున్నారు. ఇక గతేడాది విడుదల చేసిన ఎక్స్ పీరియా IV(Sony XperiaIV) ఫోన్ ధర దాదాపు రూ.1,14,700 (1399 అమెరికా డాలర్లు) నుంచి ప్రారంభమైంది. ఈ ఫోన్ గ్రీన్, బ్లాక్ కలర్స్ లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా వుండగా యూరోపియన్ యూనియన్ మార్కెట్ లో ఎక్స్ పీరియా 10 వీ సుమారు రూ.40,300 (449 యూరోలు) లకే లభించింది. వచ్చే నెలలో విడుదలయ్యే సోనీ ఎక్స్ పీరియా 5 వీ ఏ మేరకు యూజర్ల అంచనాలు అందుకుంటుందో చూడాలి.

Show comments