Sony LinkBuds Clip Launched: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ సోనీ (Sony) భారత మార్కెట్లో కొత్తగా లింక్ బడ్స్ క్లిప్ (LinkBuds Clip) ఓపెన్ ఇయర్ ట్రూ వైర్లెస్ (TWS) ఇయర్‌బడ్స్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌ను ఈ ఏడాది జనవరిలో ఉత్తర అమెరికాలో లాంచ్ చేయగా.. ఇప్పుడు భారత వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేకమైన ఓపెన్ ఇయర్ క్లిప్ డిజైన్, AI ఆధారిత కాల్ క్వాలిటీ, Bluetooth Multipoint, 37 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లతో ఈ కొత్త ఇయర్‌బడ్స్ రూపొందయాయి.
ప్రత్యేక డిజైన్:
ఇందులో సంప్రదాయ ఇన్-ఇయర్ డిజైన్‌కు బదులుగా ఓపెన్-ఇయర్ క్లిప్ స్టైల్ డిజైన్‌ను తీసుకవచ్చారు. దీని వల్ల చెవి పూర్తిగా మూసుకుపోదు. దీనితో సంగీతం వింటూనే బయట జరిగే శబ్దాలు కూడా వినిపిస్తాయి. రోడ్లపై నడిచే సమయంలో, ఆఫీస్‌లో లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు పరిసరాలపై అవగాహన కోల్పోకుండా ఉండేందుకు ఈ డిజైన్ ఉపయోగపడుతుంది. అలాగే వివిధ రకాల చెవి ఆకృతులకు సరిపోయేలా ఫిట్టింగ్ కుషన్స్‌ను కూడా అందించారు.
AI ఆధారిత కాలింగ్:
ఈ ఇయర్‌బడ్స్‌లో 10mm డ్రైవర్లు ఉన్నాయి. ఇవి SBC, AAC బ్లూటూత్ కోడెక్స్‌కు మద్దతు ఇస్తాయి. సోనీ ప్రత్యేకమైన డిజిటల్ సౌండ్ ఎన్హన్సమెంట్ ఇంజిన్ (DSEE) ద్వారా కంప్రెస్ అయిన ఆడియోలో కోల్పోయిన వివరాలను తిరిగి అందించే ప్రయత్నం చేస్తుంది. సోనీ సౌండ్ కనెక్ట్ యాప్ ద్వారా 10-బ్యాండ్ ఈక్వలైజర్ సహాయంతో యూజర్లు తమకు నచ్చిన విధంగా సౌండ్ ప్రొఫైల్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. కాల్ క్వాలిటీ కోసం డ్యూయల్ మైక్రోఫోన్లు, వాయిస్ పిక్అప్ టెక్నాలజీ, బోన్ కండెక్షన్ సెన్సార్, AI ఆధారిత సిగ్నల్ ప్రాసెసింగ్ ను అందించారు. దీంతో చుట్టూ శబ్దం ఎక్కువగా ఉన్నా వినియోగదారుడి గొంతును స్పష్టంగా గుర్తించి కాల్ నాణ్యతను మెరుగుపరుస్తుంది.
వీటిలో మూడు రకాల లిసనింగ్ మోడ్స్ ఉన్నాయి. అవే..
* స్టాండర్డ్ మోడ్ – సాధారణ సంగీత వినికిడికి.
* వాయిస్ బూస్ట్ – కాల్స్, పోడ్కాస్ట్లు, వాయిస్ కంటెంట్ మరింత స్పష్టంగా వినిపించేందుకు.
* సౌండ్ లీకేజీ రిడక్షన్ – బయటకు శబ్దం తక్కువగా వెళ్లేలా రూపొందించిన మోడ్.
వీటితోపాటు సీన్-బేస్డ్ లిజనింగ్ ఫీచర్ ద్వారా నడక, పరుగులు, జిమ్ వంటి కార్యకలాపాలను బట్టి ఆడియో అనుభవాన్ని ఆటోమేటిక్‌గా మార్చుకుంటుంది.
గూగుల్ ఫాస్ట్ పెయిర్ సపోర్ట్:
ఈ ఇయర్‌బడ్స్‌లో Bluetooth 5.3 కనెక్టివిటీ అందించారు. మల్టీపాయింట్ పేరింగ్ సపోర్ట్ ఉండటంతో ఒకేసారి రెండు డివైస్‌లకు కనెక్ట్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ ఫాస్ట్ పెయిర్, విండోస్ కంప్యూటర్ల కోసం స్విఫ్ట్ పెయిర్ ఫీచర్లు ఉన్నాయి. అవసరమైతే ఒక్కో ఇయర్‌బడ్‌ను విడిగా కూడా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా అనుకూల స్మార్ట్‌ఫోన్‌తో గూగుల్ జెమినీ హ్యాండ్స్-ఫ్రీ యాక్సెస్‌ను కూడా సోనీ అందించింది.
బ్యాటరీ లైఫ్:
వీటిని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఇయర్‌బడ్స్ 9 గంటల వరకు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేసుతో కలిపి మొత్తం 37 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. కేవలం 3 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్ చేస్తే దాదాపు ఒక గంట పాటు మ్యూజిక్ వినవచ్చని కంపెనీ తెలిపింది. ఛార్జింగ్ కోసం USB టైపు-C పోర్ట్‌ను అందించారు. ప్రతి ఇయర్‌బడ్ బరువు 6.4 గ్రాములు, ఛార్జింగ్ కేసు బరువు 42 గ్రాములు మాత్రమే. ఇవి IPX4 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో చెమట, నీటి చినుకుల నుంచి రక్షణను అందిస్తాయి.
ధర:
భారత్‌లో వీటి ధరను రూ.18,990గా నిర్ణయించారు. ఈ ఇయర్‌బడ్స్ ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్స్, ఆఫ్ లైన్ స్టోర్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్, గ్రెయిజ్, గ్రీన్, లావెండర్ రంగులలో వీటిని పొందవచ్చు.
The future of open-ear listening has arrived. The new LinkBuds Clip offers premium sound with seamless all-day convenience. Because the best listening experience is the one that's always with you.
Part of you. Open to life.
Know more: https://t.co/DPvjjvcmsm pic.twitter.com/sMZnB8nmiE
— Sony India (@sony_india) July 13, 2026

