Site icon NTV Telugu

Congress: ముంబైలో విపక్షాల సమావేశానికి సోనియా.. కూటమి ఎజెండాపై చర్చలు

Sonia

Sonia

ఆగస్టు 31న ముంబయిలో ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ మూడో సమావేశం జరగనుంది. ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించిన భారత కూటమి.. మూడో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. సీట్ల పంపకాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహావికాస్ అఘాడి అధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. అంతేకాకుండా.. గ్రూపింగ్ లోగోను ఆవిష్కరించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు నానా పటోలే తెలిపారు.

Read Also: Bhagyanagar Utsava Samiti: ఈ నెల 19నే వినాయక చవితి.. ఖైరతాబాద్ లో ఫ్లెక్సీలు నిషేధం

ఇప్పటికే మొదటి సమావేశం పాట్నాలో జూన్ లో జరగగా.. బెంగళూరులో రెండోసారి సమావేశమయ్యారు. ఆ మీటిగ్ లోనే కూటమి పేరును ప్రకటించారు. ముంబైలో జరగబోయే విపక్షాల సమావేశానికి భారతీయ జనతా పార్టీ (బిజెపి) వ్యతిరేక కూటమికి చెందిన ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. అంతేకాకుండా.. మరిన్ని పార్టీలు కూడా కూటమిలో చేరతాయని తెలుస్తోంది. ప్రస్తుతం 26 పార్టీలతో ఉన్న ఇండియా కూటమిలో.. ఈశాన్య రాష్టాలకు చెందిన కొన్ని ప్రాంతీయ పార్టీలు చేరొచ్చని సమాచారం.

Read Also: Deve Gowda: లోక్‌సభ ఎన్నికల కోసం దేవెగౌడ కీలక నిర్ణయం .. జేడీఎస్ కోర్ కమిటీ ఏర్పాటు

ముంబైలో నిర్వహించే మూడో సమావేశంలో ఇండియా కూటమి నాయలకులతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈ సమావేశంలో పాల్లొంటారు. ఇండియా కూటమి మొదటి సమావేశం బిహార్​రాజధాని పట్నాలో జరగ్గా.. రెండో సమావేశం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకం అయ్యాయి. అందులో భాగంగానే విడతల వారిగి వివిధ రాష్ట్రాలో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

Exit mobile version