NTV Telugu Site icon

CM Revanth: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాం..

Sonia Invite

Sonia Invite

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్స వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించారు. అనంతరం.. పలు విషయాలపై చర్చించనట్లు సమాచారం. కాసేపటి క్రితమే సోనియా గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అవతరణ వేడులకు సోనియా గాంధీని ఆహ్వానించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకురాలిగా సోనియా గాంధీని అవతరణ దినోత్సవ వేడుకలకు ఆహ్వానించినట్లు తెలిపారు.

Read Also: CM Jagan Stone Incident Case: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్.. కానీ..

ఇప్పటికే.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాలని కేబినెట్ తీర్మానం చేసిందని చెప్పారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు జూన్ 2న సోనియా విచ్చేస్తారని, ఆమె పర్యటన కోసం కాంగ్రెస్ శ్రేణులంతా ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి రాష్ట్రానికి వచ్చేందుకు ఒప్పుకున్న సోనియాగాంధీకి కాంగ్రెస్ నేతలు, తెలంగాణ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోనే సోనియాగాంధీ చేతుల మీదుగా రాష్ట్ర గీతం జయ జయహే ను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో.. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది.

 

Read Also: Heatwave: ఠారెత్తిస్తున్న ఎండలు.. 7 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్