కొద్ది రోజుల కిందట సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె ఢిల్లీలోని గంగా రామ్ ఆస్పత్రిలో చేరారు. ఈరోజు గంగా రామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కడుపు సంబంధిత సమస్యల కారణంగా 2025 జూన్ 15న ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. నాలుగు రోజుల తర్వాత ఆమె ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.
READ MORE: Shashi Tharoor: ‘‘బిన్ లాడెన్‌ను మర్చిపోయారా.?’’ ఆసిమ్ మునీర్‌లో లంచ్‌పై విమర్శలు..
కాగా.. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆదివారం(జూన్ 15) ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఇక్కడి గ్యాస్ట్రో విభాగంలో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పరిశీలనలో ఉన్నట్లు తెలిపాయి. ఈ నెల 9న సోనియా ఇదే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీనికి రెండు రోజుల ముందు శిమ్లాలోని ఇందిరాగాంధీ వైద్య కళాశాల ఆసుపత్రి (ఐజీఎంసీ)లో చేరిన విషయం తెలిసిందే. అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆమెకు వైద్యులు చికిత్స అందించారు.
READ MORE: Viral Video: విమానంలో అలా ఆడేస్తున్నారేంట్రా బాబు.. తిట్టిపోస్తున్న నెటిజన్స్..!
