NTV Telugu Site icon

Sonakshi Sinha Marriage: 20న హల్దీ వేడుక.. 23న పెళ్లి!

Sonakshi Sinha, Zaheer Iqbal

Sonakshi Sinha, Zaheer Iqbal

Sonakshi Sinha Haldi and Marriage Date: బాలీవుడ్‌ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని సోనాక్షి వివాహం చేసుకోనున్నారు. ఓ వైపు పెళ్లి పనులు జరుగుతుండగా.. మరోవైపు కాబోయే వధూవరులు బ్యాచిలర్ పార్టీలతో బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా సోనాక్షి-జహీర్ పెళ్లికి సంబందించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సోనాక్షి సిన్హా హల్దీ వేడుక గురువారం (జూన్ 20) జరగనునట్లు తెలుస్తోంది. బాంద్రాలోని తన నివాసంలో జరిగే ఈ వేడుకకు సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు హాజరుకానున్నట్లు సమాచారం. ఇక పెళ్లి 23న ముంబైలో జరగనుందట. సోనాక్షి-జహీర్ జంట ముంబైలోని బాస్టియన్‌లో పెళ్లి చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ పెళ్లికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు, దగ్గరి సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారట. పెళ్లి అనంతరం రిసెప్షన్ గ్రాండ్‌గా ఏర్పాటు చేసి.. బాలీవుడ్ నటీనటులను అందరినీ పిలవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే పెళ్లి గురించి ఈ జంట ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు.

Also Read: Kane Williamson: కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం!

శత్రుఘ్న సిన్హా నటవారసురాలిగా సోనాక్షి సిన్హా ఇండస్ట్రీలోకి వచ్చారు. సల్మాన్‌ ఖాన్ నటించిన ‘దబంగ్‌’ సినిమాతో సోనాక్షి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు. ఎన్నో సినిమాల్లో వైవిధ్య పాత్రల్లో నటించి తానేంటో నిరూపించుకున్నారు. చివరిసారిగా సంజయ్‌ లీలా బన్సాలీ రూపొందించిన ‘హీరామండి’ వెబ్‌ సిరీస్‌లో సోనాక్షి నటించారు. ఇక ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’ చిత్రంలో జహీర్ ఇక్బాల్‌తో అమ్మడు కలిసి నటించారు. ఆ సినిమా సెట్స్‌లోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, గత ఏడాది కాలంగా ఈ జంట సహజీవనం చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.