Prakasam Crime: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో విచిత్ర దొంగతనాన్ని బయట పెట్టారు పోలీసులు.. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన ఊరికే కన్నం వేశాడు ఓ అల్లుడు.. దొంగగా మారి.. వరుసగా దొంగతనాలకు పాల్పడ్డాడు.. చూడటానికి విచిత్రంగా ఉన్న అల్లుడే దొంగగా మారి 12 ఇళ్లల్లో దొంగతనం చేసి పోలీసులకు దొరికి.. చివరకు కటకటాల లెక్క పెడుతున్నాడు ముండ్ల రాయమ్య అనే దొంగ అల్లుడు..
Read Also: Winter: చలికాలంలో హీటర్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో గుర్రపుశాల గ్రామస్తులు పనులకోసం వలసవెళ్లారు. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన ఓ కుటుంబం అల్లుడు అయిన ముండ్ల రామయ్య.. తమ దగ్గరే పెట్టుకున్నారు. ముండ్ల రామయ్య క్రికెట్ బెట్టింగ్ లు ఆడుతూ చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. గ్రామస్తులు పనులకోసం వలసలకు వెళ్లడం గమనించి రోజుకు మూడు ఇళ్లల్లో నాలుగు రోజుల పాటు 12 ఇళ్లల్లో 6 లక్షల 74 వేల రూపాయలు దొంగ తనం చేశారు.. అంతేకాదు.. తనకు ఏమీ తెలియనట్లు హైదరాబాద్ వెళ్లి జల్సాలు చేయడం మొదలెట్టాడు. గ్రామంలో కొన్ని ఇళ్లల్లో తాళాలు పగలగొట్టి ఉండడం చూసిన స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై చౌడయ్య గుర్రపుశాల గ్రామం పోయి అక్కడ దొంగతనాలు జరిగిన ఇళ్లను పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ దొంగతనంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులు గ్రామ అల్లుడే దొంగగా నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్ లో వలపన్ని పట్టుకొని యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముద్దాయి ముండ్ల రామయ్యను కోర్టులో హాజరు పరిచి రికవరీ చేసిన 6 లక్షల 74వేల రూపాయల నగదును కోర్టు ద్వారా బాధితులకు అందజేస్తామని సీఐ ప్రభాకర్ రావు మీడియాకు టెలిపారు. ఊరి అల్లుడే దొంగ అని తెలియడంతో గ్రామస్తులు అంతా అవాక్కయ్యారు.