NTV Telugu Site icon

Somu Veerraju: పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉన్నారు..

Somu Veerraju

Somu Veerraju

సెప్టెంబర్ 17 నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకోని సేవా పక్షోత్సవాలను దేశ వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఇవాళ తిరుపతిలోని అలిపిరి లింక్ బస్టాండ్ దగ్గర స్వచ్ఛసేవా కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. లింక్ బస్టాండ్ లో చెత్తను బీజేపీ నేతలు శుభ్రం చేశారని ఆయన తెలిపారు. రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించే ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశామని అన్నారు.

Read Also: Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. జీతం రూ.2 లక్షలు..పూర్తి వివరాలు..

అలిపిరి లింక్ బస్టా్ండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు తెలిపారు. స్వచ్ఛ సేవ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు.. అలిపిరి లింక్ బస్టాండ్ లో చెత్తను శుభ్రం చేసే సమయంలో భక్తులు మాతో భాగస్వామ్యులు అయ్యారు అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి బెయిల్ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది.. ఆ విషయంపై నేను మాట్లాడను అంటూ సోము వీర్రాజు తెలిపారు.

Read Also: NMC: ఇకపై అలా చేస్తే కోటి కట్టాల్సిందే

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రజు పేర్కొన్నారు. కల్తీ మద్యంపై రెండు సంవత్సరాలకు ముందే మాట్లాడాను.. మద్యం కొనుగోళ్లలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంది అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు షరామామూలయ్యాయి అని అన్నారు. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతోనే పొత్తులో ఉన్నారు అని ఆయన వెల్లడించారు.