AP Special Category Status: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై పలు సందర్భాల్లో కేంద్రం తేల్చేసింది.. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయంగా పేర్కొంది.. అయితే, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదన్న ఆయన.. ప్రత్యేక హోదా అంశం పూర్తయిన అంశం.. ఇంకా దాంట్లో ఏమైన కొరవలు ఉంటే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. శ్రీకాళహస్తిలో రేపు జరగనున్న భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి పరిశీలించిన రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత తొమ్మిళ్లేగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అందించిన సుపరిపాలన ప్రజలకు వివరించేందుకు రాష్ర్టంలోని 26 జిల్లాల్లో ఈ సభలు నిర్వహిస్తున్నాం అన్నారు.
Read Also: Big Breaking: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. పింఛన్ పెంపు
ఇక, శ్రీకాళహస్తిలో జరిగే సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే రాష్ర్టంలో ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారని తెలిపారు సోము వీర్రాజు.. ఈ నెల 11వ తేదీన విశాఖలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారని వెల్లడించారు.. అలాగే కేంద్ర మంత్రి మురళీధరన్ మూడు జిల్లాల్లో జరిగే సభల్లో పాల్గొంటారని.. ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అభివృద్ధి వివరిస్తామన్నారు. జూన్ 30వ తేదీ తర్వాత రైతాంగ సమస్యలు, టిడ్కో ఇళ్ళ సమస్యల పై పోరాటం చేస్తామని ప్రకటించారు.. రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామన్నారు సోము వీర్రాజు.