NTV Telugu Site icon

Somu Veerraju: ప్లాన్‌ ప్రకారమే దాడి.. ఇది పిరికి చర్య..

Somu Veerraju

Somu Veerraju

Somu Veerraju: బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి వ్యవహారం కలకలం రేపుతోంది.. అయితే, ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విజయవాడలో మీడియాతో మాట్లాడినా యన.. 1200 రోజుల రైతుల ఉద్యమానికి మద్దతుగా శుక్రవారం పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మద్దతు తెలిపి వస్తున్న సందర్భంలో ప్లాన్ ప్రకారం దాడి చేశారని మండిపడ్డారు.. కారు అద్దాలు ధ్వంసం చేశారు.. ఆయనపై దాడికి పాల్పడ్డారు.. ఆయనతో ఉన్న సురేష్, యాదవ్ అనే వ్యక్తులపై వివక్ష రహితంగా కొట్టారన్న ఆయన.. ఇది ప్రభుత్వ పిరికి చర్యగా అభివర్ణించారు.. వైసీపీ మనుషులతో పోలీసుల సమక్షంలో ఇలాంటి అమానుష చర్యలలను బీజేపీ ఖండిస్తుంది.. ఇలాంటి చర్యలు ఇకపై పునరావృతం కాకూడదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పోలీసుల నిర్లక్షంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు సోము వీర్రాజు.. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని.. ప్రభుత్వం ఈ ఘటనపై స్పష్టం చేయాలన్నారు.. ఎంపీ చేతకాని మాటలు అంటున్నాడు.. మేం వారిపై దాడి చేశాం అని.. ఇది అబద్ధాల ప్రకటన అని తిప్పికొట్టారు. పూర్తిగా రెచ్చగొట్టే దోరణిగా బీజేపీ భావిస్తోందన్న ఆయన.. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాం.. ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారో స్పష్టంగా పేర్కొన్నాం అని తెలిపారు. ఈ ఘటనను ఖండిస్తున్నాం.. ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతున్నాం అన్నారు.

ఈ దాడి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తూ చంద్రబాబు డైరక్షన్ అని అనడం ఎందుకు? అని ప్రశ్నించారు సోము వీర్రాజు.. ఈ మధ్య జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అమరావతిలో రాజధాని ఉండాలని కేంద్రం పేర్కొంది.. మసిపూసి మారాడు కాయలు చేసినట్లు వైసీపీ ప్రచారం చేస్తుందని విమర్శించారు. మేం ఎప్పుడు కట్టుబడి ఉంటాం.. రాజధానికి కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీయేనని స్పష్టం చేశారు.. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలు రాజధానిగా పెట్టాం అన్నారు.. అసలు, నాన్చి వేత ధోరణిగా మూడు రాజధానుల అంశం ఉంచి ఏమి సాధించారు..? అని నిలదీశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.