Somireddy Chandramohan Reddy: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.. ఆయన బెయిల్ కోసం ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారు ఆయన తరఫు న్యాయవాదులు.. అయితే, చంద్రబాబు విడుదలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నెల్లూరు జిల్లాలో టీడీపీ ర్యాలీ నిర్వహించారు.. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఆటోలో వీఆర్‌సీ సెంటర్‌కు వచ్చారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.. బైక్ పై వచ్చారు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. ఇక, ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 9వ తేదీన లేదా 10వ తేదీన మా నాయకుడు బయటకు వస్తున్నాడు అని తెలిపారు. దమ్ముంటే టీడీపీ ప్రభంజనాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవాలి అంటూ సవాల్ చేశారు.
Read Also: Student Suicide: కోటాలో విషాదం.. మనోవేదనతో బీఏ విద్యార్థిని ఆత్మహత్య..
ఇక, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినా తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు సోమిరెడ్డి.. నిరసన చేస్తామంటే నోటీసులు పంపించారు.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జులుం చేస్తున్నాడు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ అంతు చూస్తారు అంటూ హెచ్చరించారు.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు నేతలు, కార్యకర్తలు.. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ కొన్ని సీట్లు కావాలని కోరుతోంది.. కావలి నియోజక వర్గ టికెట్ కూడా జనసేన పార్టీ నేతలు అడుగుతున్నారు. సీట్ల కేటాయింపు పై. చంద్రబాబు దే తుది నిర్ణయం.. అది ఏ విధంగా ఉంటుందో దానికి అనుకూలంగా వెళ్తామని ప్రకటించారు.