Site icon NTV Telugu

Somireddy Chandramohan Reddy: కాకాణిని పట్టిస్తే బహుమతి..! సోమిరెడ్డి ఆఫర్‌..

Somireddy

Somireddy

Somireddy Chandramohan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. గత నెలరోజులుగా పరారీలో ఉన్నారు. ఆయన కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఏపీ ఇలా తదితర ప్రాంతాల్లో పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.. బంధువులు, స్నేహితుల నివాసాలపై కూడా నిఘా పెట్టారు పోలీసులు.. అయితే, కాకాణి ఆచూకీ చెబితే బహుమతి ఇస్తాను అంటూ బంపరాఫర్‌ ఇచ్చారు మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియడం లేదు.. నేను ఆఫర్ ఇస్తున్నాను.. వైసీపీ వాళ్లు కానీ ఎవరైనా కావచ్చు ఆయన ఆచూకీ తెలిపితే కాకాణి ఇంటి పక్కన ఉన్న కరోనా హౌస్ ను బహుమతిగా ఇద్దామని ఆలోచిస్తున్నా అని ప్రకటించారు.. అందరూ ముందుకు రండి.. కాకాణి ఆచూకీ తెలపాలని కోరారు..

Read Also: 2025 TVS Apache RR 310: టీవీఎస్ నుంచి సూపర్ ప్రీమియం స్పోర్ట్స్ బైక్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

పోలీసుల చొక్కాలు విప్పుతానని అన్నాడు.. సవాళ్లు విసిరారు.. తొడలు కొట్టారు.. ఇప్పుడు ఎక్కడున్నారు..? పిరికి పందలా దాక్కున్నారు..! అంటూ కాకాణిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి.. గతంలో నాకు విదేశాలలో ఆస్తులు.. విదేశీ బ్యాంకులలో ఖాతాలున్నట్టు తప్పుడు పత్రాలు విడుదల చేశారు.. ఆ కేసులో రెండు నెలల పాటు దాక్కున్నారు.. సుప్రీంకోర్టు ఇచ్చిన కండిషన్ బెయిల్ తో బయటకు వచ్చారు.. ఇక, వైసీపీ ప్రభుత్వం రాగానే దోపిడీకి పాల్పడ్డారు.. నాపై తప్పుడు కేసులు పెట్టారు అని మండిపడ్డారు.. కాకాణి మాట్లాడిన భాష సరికాదు అని హితవు పలికారు.. అలాగే వల్లభనేని వంశీ కూడా.. జగన్ కు ఏమాత్రం మానవత్వం ఉన్నా వల్లభనేని వంశీ మాట్లాడినప్పుడే చర్యలు తీసుకోవాల్సింది అన్నారు.. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కూడా పోలీసులపై మాట్లాడిన బాష సరికాదు.. అంత దిగజారి పోతారనుకోలేదన్నారు. కాకాణి దర్శనమిస్తే చూడాలని ఉంది.. చాలా రోజులైంది.. మంత్రులుగా పనిచేసిన వాళ్లు ఇలా పిరికివాళ్లుగా పారిపోతారని అనుకోలేదు అంటూ సెటైర్లు వేశారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి..

Exit mobile version