Site icon NTV Telugu

Somireddy Chandramohan Reddy: రైతుల ఆత్మహత్యల్లో.. అప్పుల్లో కూడా మన రాష్ట్రానిదే అగ్రస్థానం

Somireddy

Somireddy

Somireddy Chandramohan Reddy: రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.. రైతుల అప్పుల్లో కూడా మన రాష్ట్రానిదే అగ్రస్థానమే అని ఆరోపించారు టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యవసాయ రంగంపై వేల కోట్ల ఖర్చు చేశామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు. ఇక, నాకు విదేశాల్లో వేయి కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని కాకాని తప్పుడు ఆరోపణలు చేశారు.. అదేవిధంగా రైతుల కోసం వెచ్చించిన ఖర్చును కూడా తప్పుగా చూపించారని మండిపడ్డారు.. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.. అంతే కాదు రైతుల అప్పుల్లో కూడా మన రాష్ట్రానిదే అగ్రస్థానం అన్నారు. 400 పైగా మండలాలలో కరువు ఉంటే కేవలం 103 మండలాలను మాత్రమే ప్రకటించారని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులను పరిశీలించేందుకు టీడీపీ నేతల ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ పర్యటిస్తోందిన.. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.

Read Also: Kishore Satya: సౌత్ లో సప్త జ్యోతిర్లింగ టూర్ ని ప్రారంభించబోతున్నాం..కిషోర్ సత్య

అయితే, తిట్లీ తుఫాను వచ్చినప్పుడు నిబంధనల కంటే అధికంగా నష్ట పరిహారాన్ని రైతులకు ఇచ్చాం అని తెలిపారు సోమిరెడ్డి.. ఇక, రొయ్యల రైతులపై విద్యుత్ భారాన్ని మోపుతున్నారు.. అవినాష్ రెడ్డి.. అదానీ.. షిరిడి సాయి సంస్థలను మాత్రమే బతికిస్తున్నారు.. కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రకటనలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలుకు 66 వేల కోట్ల రూపాయలు వెచ్చించామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించి శ్వేత పత్రం విడుదల చేసి వాస్తవంగా వెచ్చించిన ఖర్చును వివరించాలని డిమాండ్‌ చేశారు. దమ్ముంటే వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రైతుల మధ్యకు వెళ్లాలి అని సవాల్‌ చేశారు. రైతులకు వేలకోట్ల మేర బకాయిలు చెల్లించాలి.. అదేవిధంగా విద్యుత్ రంగ సంస్థలకు కూడా భారీగా బకాయిలు ఉన్నాయి.. రైతు భరోసాలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. రైతులకు అందిస్తున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి. తప్పుడు సమాచారం ఇచ్చిన ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి..

Exit mobile version