NTV Telugu Site icon

Uttar Pradesh: జూదగాళ్ల ఆచూకీ చెప్పాలని రైతును చితకబాదిన పోలీసులు.. చికిత్స పొందుతూ మృతి

Up

Up

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ రైతును పోలీసులు అన్యాయంగా కొట్టి చంపారు. ఈ ఘటనకు పాల్పడ్డ పోలీసులపై మృతుడి కుటుంబీకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా.. వారిపై శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఆ తర్వాత మృతుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. ఈ ఘటన సర్దార్ నగర్‌లో చోటుచేసుకుంది.

Read Also: World Cup 2023: సెమీస్లో తలపడే జట్లు ఇవే.. ఇండియాతో ఆ జట్టు పోటీ

వివరాల్లోకి వెళ్తే.. ఓ రైతు తన పొలం నుండి తిరిగి వస్తుండగా.. అదే మార్గంలో ఒకచోట కొందరు జూదం ఆడుతున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో జూదరులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ క్రమంలో అటునుంచి వస్తున్న రైతును పోలీసులు తీవ్రంగా కొట్టారు. దీంతో అక్కడే తీవ్ర గాయాలతో పడిపోయాడు. అయితే ఆ రైతు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీంతో వారు అతనికోసం వెతకగా.. పొలంలో గాయపడి పడి ఉన్నాడు. జరిగిన విషయాన్ని మొత్తం మృతుడు కుటుంబీలకు చెప్పాడు. అనంతరం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబీకులు పోలీసులపై హత్యాయత్నం ఫిర్యాదు చేశారు.

Read Also: Viral Video: బ్యాట్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న బ్యాట్స్మెన్లు.. వీడియో వైరల్

పొలం నుంచి తిరిగి వస్తున్న తన అన్నను పోలీసులు పట్టుకుని జూదం ఆడేవారి పేర్లు చెప్పాలని బెదిరించారని మృతుడి సోదరుడు తెలిపాడు. వారి పేర్లు చెప్పడానికి నిరాకరించడంతో పోలీసులు తీవ్రంగా కొట్టారని అన్నాడు. దీంతో తల, ఛాతి, వీపుపై తీవ్ర గాయాలయ్యాయని.. పరిస్థితి విషమంగా ఉండడంతో బరేలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పాడు.