NTV Telugu Site icon

Seethakka: ఆదివాస బిడ్డనైన నన్ను మంత్రిగా చూసి కొందరు ఓర్చుకోలేకపోతున్నారు

Seethakka

Seethakka

పెంపుడు మనుషులను పెట్టుకుని బీఆర్ఎస్ వాళ్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. తీన్మార్ మల్లన్న పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి పంపిందన్నారు.
శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. వందల కోట్లు ఖర్చుపెట్టి ఆరోజు నన్ను ఎమ్మెల్యేగా గెలవకుండా చేయాలని ప్రయత్నం చేశారన్నారు. ఈరోజు తీన్మార్ మల్లన్న పై కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఆదివాస బిడ్డనైన నన్ను మంత్రిగా చూసి కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారన్నారు. మొదటి విడుతగా సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ప్రోత్సాహకంగా ప్రకటించామని తెలిపారు. దొడ్డు వడ్లను కొనమని ఏ ఒక్క సందర్భంలో అనలేదని స్పష్టం చేశారు. తినడానికి ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొంటుందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫస్ట్ తారీకు రాగానే అందరికీ జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు. రైతుల సమస్యలను, నిరుద్యోగుల సమస్యలు ప్రతి ఒక్కటి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

READ MORE: Heatwave effect: రాజస్థాన్‌లో తీవ్రమైన వాడగాలులు.. 12 మంది మృతి

కాగా.. ఉమ్మడి నల్గొండ- ఖమ్మం -వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఉప ఎన్నికల్లో చింతపండు నవీన్ గారిని బలపరుస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్ లు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల పట్టభద్రులు తప్పకుండా సీపీఎస్ రద్దు -పాత పెన్షన్ పునరుద్ధరణ కృషి చేసే మల్లన్న ను మొదటి ప్రాధాన్యత ఓటు తో గెలిపించాలన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న తప్పకుండా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Show comments