NTV Telugu Site icon

Game Changer : అక్కడ సాలీడ్ బుకింగ్స్ అందుకుంటున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’

Game Changer

Game Changer

Game Changer : స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో.. గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో.. ఒక్కో అప్డేట్ ఇస్తూ వస్తున్నారు మేకర్స్. రీసెంట్‌గా రిలీజ్ చేసిన మాస్ సాంగ్ రా మచ్చా మచ్చా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. యూట్యూబ్‌లో టాప్ ట్రెండ్ అవుతూ మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్స్‌కి పైగా వ్యూస్ క్రాస్ చేసింది. ఇక అంతకుముందు రిలీజ్ చేసిన జరగండి సాంగ్ కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ పాట వినడం కంటే.. చూడ్డానికి విజువల్ పరంగా అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. లేటెస్ట్ గా వచ్చిన థర్డ్ సింగిల్ మెలోడీ సాంగ్ కూడా అద్భుతంగా ఉందని కితాబు అందుకుంది.

Read Also:Rapo22 : మీలో ఒకడు సాగర్.. రామ్ పోతినేని ఫస్ట్ లుక్ సూపర్బ్

ఈ సినిమాలో కియారా ఆద్వానీ హీరోయిన్ గా నటించింది. మరి సాలిడ్ హైప్ ఉన్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఇక దగ్గరకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆల్రెడీ బయట దేశాల్లో ఈ చిత్రానికి బుకింగ్స్ మొదలు కాగా యూకే మార్కెట్ లో అయితే గేమ్ ఛేంజర్ సాలిడ్ స్టార్ట్ తో మొదలైనట్టుగా తెలుస్తుంది. అక్కడ ఆల్రెడీ టికెట్ సేల్స్ లో జస్ట్ కొద్దిసేపట్లోనే 1500 ప్లస్ టికెట్స్ అమ్ముడుపోయి సాలిడ్ స్టార్టింగును అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో గేమ్ ఛేంజర్ సినిమాతో చరణ్ ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ లో అక్కడ మంచి నెంబర్ పెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహించిన ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Read Also:Minister Kondapalli Srinivas: భూ సమస్యల సత్వర పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు..

Show comments