Site icon NTV Telugu

Soldiers Bus Accident: కారును ఢీకొట్టిన సైనికులు ప్రయాణిస్తున్న బస్సు.. ముగ్గురు మృతి, 26 మందికి గాయాలు..!

3

3

శనివారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్‌ లోని సియోని జిల్లాలో స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (ఎస్‌ఎఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు కారును ఢీకొని బోల్తాపడడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా., మరో 26 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒక జవాన్‌ కు తీవ్ర గాయాలు కాగా., అతడిని సమీపంలోని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. సియోని జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియోని – మండ్లా రాష్ట్ర రహదారిపై ధనగధ గ్రామ సమీపంలో తెల్లవారుజామున 1 గంటకు ఈ ప్రమాదం జరిగింది.

Also Read: X Blue Tick: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఇకపై వారికి ‘బ్లూ టిక్’ కు నో పేమంట్స్..!

రాష్ట్ర పోలీసు 35వ బెటాలియన్ ఆఫ్ SAF ను మాండ్లా నుండి పంధుర్నా (చింద్వారా) కి సిబ్బందిని తీసుకువెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కన్హయ్య జస్వానీ (75), నిక్లేష్ జస్వానీ (45), డ్రైవర్ పురుషోత్తం మహోబియా (37) అక్కడికక్కడే మృతి చెందినట్లు కియోలారి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి చైన్ సింగ్ ఉయికే తెలిపారు. మృతులు మండల వాసులని., గాయపడిన మరో ఇద్దరు కారు ప్రయాణికులు కియోలారి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: Mission Bhagiratha: మిషన్ భగీరథ నిర్వహణ సంస్థలతో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ భేటీ

కారులో ప్రయాణిస్తున్న వారు నాగ్‌పూర్ నుండి ఆసుపత్రికి సంబంధించిన పని ముగించుకుని తిరిగి వస్తున్నారని అధికారి తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎస్ఏఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. దీనితో మొత్తం 26 మంది ఎస్ఏఎఫ్ జవాన్లు గాయపడ్డారు. దాంతో వెంటనే వారిని అధికారులు కియోలారి ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్ర గాయాలపాలైన ఒకరిని నాగ్‌పూర్‌ కు తరలించామని, ఘటనపై విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు.

Exit mobile version