NTV Telugu Site icon

Software Engineer Family Suicide: భార్యాపిల్లలను చంపి.. టెకీ ఆత్మహత్య

Suicide

Suicide

Software Engineer Family Suicide: సమస్యలు లేని మనిషే లేడు, పరిష్కారం లేని సమస్యే లేదు, ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది, చనిపోవడానికి ఉన్న ధైర్యాన్ని బ్రతకడం కోసం చూపిస్తే భవిష్యత్తు మరోలా ఉంటుంది. కానీ, ప్రస్తుతం సమస్య రాగానే ఆలోచన పరిష్కారం వెతికే దిశను మాని, ప్రాణాలను వదిలే వైపుకి సాగుతుంది, అలాంటిదే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య, భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

Read Also: Extramarital Affair: ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తితో ఎఫైర్.. ప్రియుడితో కలిసి భర్త హత్య

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నం బందరు కోటకు చెందిన గుండు వినయ్ బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ బెంగుళూరులోనే ఒక ఫ్లాట్ లో భార్య హైమావతి మరియు ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు, పిల్లల వయసు ఒకరికి ఏడాది కాగా మరొకరికి 2 సంవత్సరాలు. అయితే గత మంగళవారం వినయ్ తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకొని విగత జీవులుగా మారారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించగా, కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలు ఆత్మహత్య వెనక కారణాల గురించి దర్యాప్తు చేపట్టారు.. మృతదేహాలను వినయ్ స్వస్థలం బందరు కోటకు పంపారు. అయితే భార్య భర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని బంధువులు చెబుతున్నారు.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఒకేసారి కుటుంబలో ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారులతో సహా కొడుకు కోడలు మృతి చెందడంతో కుటుంబలో తీరని దుఃఖం చోటుచేసుకుంది.. ఈ ఘటనతో స్థానికంగ విషాద ఛాయలు కమ్ముకున్నాయి. కానీ, వినయ్‌.. భార్యా పిల్లలను హత్య చేసి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.