Folk Singer Suicide: ప్రేమ పేరుతో జరిగే దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముక్కు ముఖం తెలియని వారు ప్రేమించుకోవడం.. ఆ తర్వాత చిన్న కారణాలతో మనస్పర్థలు వచ్చి హత్యలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ దారుణాలకు సోషల్ మీడియా కారణం కావడం అత్యంత బాధాకరం. తాజాగా సోషల్ మీడియా ప్రేమ ఓ ఫోక్ సింగర్ ప్రాణం తీసింది. ఇన్ స్టాలో పరిచయమైన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడితో సింగర్ శృతి ప్రేమలో పడింది.
Read Also: Lagacharla Incident: లగచర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరు
శృతి స్వస్థలం నిజామాబాద్ జిల్లా కాగా.. జానపద పాటలతో శృతి ఫేమస్ అయింది. 20 రోజుల క్రితం ఎవరికి చెప్పకుండా ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకునే వరకు బాగానే ఉన్నా అనంతరం వేధింపులు షురూ అయ్యాయి. కట్న కానుకల కోసం ఫోక్ సింగర్ శృతిని భర్త, అత్తమామలు వేధింపులకు గురిచేశారు. వేధింపులు తాళలేక పెళ్ళైన 20 రోజులకే శృతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటివారే హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో శృతి మృతదేహం ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.