Sneha Ulla-Aishwarya :ఐశ్వర్య రాయ్ పోలికలే స్నేహా ఉల్లాల్‌కు శాపమయ్యాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినీ పరిశ్రమలో కొందరు నటీనటులు తమ నటనతో గుర్తింపు తెచ్చుకుంటే, మరికొందరు తమ రూపంతో రాత్రికి రాత్రే సెన్సేషన్ అవుతుంటారు. సరిగ్గా 2005లో ‘లక్కీ: నో టైమ్ ఫర్ లవ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్ విషయంలోనూ ఇదే జరిగింది. అచ్చం ఐశ్వర్య రాయ్లా ఉండటంతో దేశమంతా ఆమె వైపు చూసింది. అయితే, అదే పోలిక ఆమె సొంత గుర్తింపును దెబ్బతీస్తుందని అప్పట్లో స్నేహా చాలా భయపడింది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాయ్‌ను కలిసినప్పుడు తను ఎంతలా టెన్షన్ పడిందో స్నేహా గుర్తు చేసుకుంది.
‘నన్ను ఐశ్వర్య రాయ్‌తో పోల్చడం వల్ల ఆమె ఎక్కడ ఫీల్ అవుతుందో అని భయపడి.. ఆమెను కలిసినప్పుడు ‘సారీ, నన్ను ద్వేషించకండి’ అని కోరాను. కానీ ఐశ్వర్య చాలా హుందాగా నన్ను బాలీవుడ్ కుటుంబంలోకి ఆహ్వానించింది’ అని స్నేహా నాటి జ్ఞాపకాలను పంచుకుంది. బాలీవుడ్లో పోలికల గోల ఎక్కువవడంతో టాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ, ఇక్కడ ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, బాలయ్య సరసన ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
Also Read
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
- Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
- Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
కానీ, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ‘ఆటో ఇమ్యూన్ డిజార్డర్’ అనే వ్యాధి ఆమెను సినిమాలకు దూరం చేసింది. తీవ్రమైన నీరసం వల్ల షూటింగ్లలో పాల్గొనడం కష్టమవ్వడంతో దాదాపు నాలుగేళ్ల పాటు విరామం తీసుకోవాల్సి వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత 2020లో ఓటీటీలోకి అడుగుపెట్టిన స్నేహా, తాజాగా 2026లో తెలుగులో ‘నీలకంఠ’ అనే సినిమాతో మళ్లీ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్లాన్ చేసుకుంటోంది.
తాజావార్తలు
-
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
-
Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
-
Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
-
Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
-
Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!