తాజాగా ఓ రైలులో పాము దూరడంతో 17 నిమిషాల పాటు రైలును ఆపేశారు. అయితే ఇది భారతదేశంలో కాదండి.. జపాన్ దేశంలోని శంఖం షింకన్‌సెన్ బుల్లెట్ రైలులో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిజానికి ఈ బుల్లెట్ రైలు చాలా తక్కువగా డిలే అవుతుంది. కాకపోతే., తాజాగా ఓ పాము రైలులో కనిపించడంతో షింకన్‌సెన్ సర్వీస్ ను 17 నిమిషాల పాటు ఆపేశారు. మంగళవారం నాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. రైలు ప్రయాణ సమయంలో సుమారు 16 ఇంచులు పొడవున్న ఓ పాముని బుల్లెట్ రైల్లో ప్రజలు గుర్తించారు. టోక్యో, నగోయ మార్గమధ్యంలో ఈ పాముని కనుగొన్నారు.
Also read: Kakarla Suresh: వైసీపీకి షాక్.. కాకర్ల సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు
అయితే పామును చూసిన వారు ఆ పాము విషపూరితమైనదా లేక సాధారణ పాము అన్న విషయం తెలియక.. ప్రయాణికులు కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. అయితే అదృష్టం కొద్దీ ప్రాణాలకు ఎటువంటి ప్రాణహాని జరగలేదని సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ తెలిపింది. షింకన్‌సెన్ రైలు లోకి ప్రయాణికులు చిన్నపాటి పిల్లులు, కుక్కలు, అలాగే ఇతర జంతువులను కూడా తీసుకువెళ్లడానికి పర్మిషన్ ఉంది. కాకపోతే ఆ రైల్లో పాములను తీసుకోవడానికి ఎటువంటి అనుమతులు లేవు.
Also read: Sri Ramanavami LIVE Updates: దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు.. లైవ్ అప్‌డేట్స్
ఇకపోతే అసలు పాము రైలు లోకి ఎలా వచ్చిందని అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే జపాన్ రైల్వే అధికారులు ప్యాసింజర్ బ్యాగ్స్ ను చెక్ చేయమని వారు తెలిపారు. ఇకపోతే పాము కనిపించిన తర్వాత దాన్ని పట్టుకున్న తర్వాత అదే రైలును పంపిద్దామని అనుకున్నారు. కాకపోతే కంపెనీ మాత్రం మరో రైలును అక్కడికి తీసుకువచ్చి ప్రయాణికులు అందరిని అందులో తరలించింది. దీంతో మొత్తం 17 నిమిషాల పాటు బుల్లెట్ ట్రైన్ ఆలస్యంగా నడిచింది.