NTV Telugu Site icon

Snake Farming: ఆ ఊర్లో పాములే అట్రాక్షన్.. కోట్లు సంపాదిస్తూ కోటలు కట్టేస్తున్నారు

Snake Farming

Snake Farming

Snake Farming: భారతదేశం వ్యవసాయ దేశం. ఇక్కడ ప్రజలు ధాన్యాలు, పండ్లు, కూరగాయలను పండిస్తారు. చేపల పెంపకం, కోళ్ళ పెంపకం, ఇతర పనులు కూడా వ్యవసాయానికి సంబంధించినవే. కొన్ని ఊర్లలో పాములను సాకి అమ్మి కోట్లు సంపాదించేస్తున్నారు. పాముల పెంపకమా.. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? పాములు కనిపించిన దాని నీడ కనిపించినా ఆమడదూరం పారిపోతాం అలాంటిది పెంచడమేంటి రా బాబూ అనుకుంటున్నారా? పాము కనిపిస్తే దాన్ని వెతికి వెంటాడి చంపేస్తాం. ఎందుకంటే అది మనల్ని కాటు వేస్తుందో లేదో తెలియదు కానీ.. పాము అంటే భయం అంతే.. అలాంటిది పాములు పెంచడం ఎంట్రా నాయనా అని అనుకుంటున్నారు కదా.. పాముల పెంచడమే కాదండోయ్‌ దాని నుంచి వచ్చే ఆదాయం వింటే షాక్‌ తింటారు. అవును పాములను పెంచి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న దేశం ప్రపంచంలోనే ఉంది. ఈ దేశం పేరు కూడా మీకు తెలియనిది కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు అక్కడ తిండికి సంబంధించిన వింత వార్తలు, కరోనా అంటే ఆ దేశం పేరు ఠక్కున వస్తుంది. అదేనండి చైనా.

ఏటా కోటి పాములు
చైనాలోని జిసికియావో గ్రామంలోని ప్రజలు పాములను పెంచడం ద్వారా చాలా డబ్బు సంపాదించారు. ఈ గ్రామం ప్రధాన ఆదాయ వనరు పాముల పెంపకం, దీని కారణంగా ఈ గ్రామాన్ని స్నాక్ విలేజ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా పాముల పెంపకానికి ప్రసిద్ధి చెందిన ఈ గ్రామంలోని దాదాపు ప్రతి ఇంట్లో పాములను పెంచుతారు. ఈ గ్రామ జనాభా సుమారు వెయ్యి. ఇక్కడ నివసించే ప్రతి వ్యక్తి 30,000 పాములను పెంచుతాడు. దీన్ని బట్టి ఇక్కడ ప్రతి ఏటా కోటి పాములు సాగుతాయని ఊహించవచ్చు.

Read Also:Food Inflation: వ్యవసాయ దేశానికి నేపాల్, ఆఫ్రికా నుండి పప్పులు, టమాటాలు దిగుమతులా?

బొమ్మలకు బదులు పాములతోనే ఆటలు
ఇక్కడ పెంచే పాములలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదకరమైన పాములు ఉన్నాయి. వాటిలో విషంతో 20 మందిని సునాయాసంగా చంపగల నాగుపాములు, కొండచిలువలు లేదా వైపర్‌లు కొన్ని నిమిషాల్లో కాటువేసి ప్రజలను పిచ్చివాడిని చేస్తాయి. ఇవి కాకుండా అనేక ప్రమాదకరమైన జాతుల పాములను ఇక్కడ పెంచుతున్నారు. ఈ గ్రామంలో పుట్టిన ప్రతి చిన్నారి బొమ్మలకు బదులు పాములతో ఆడుకుంటుంది. ఈ వ్యక్తులు వాటికి అస్సలు భయపడరు. ఎందుకంటే వారికి వచ్చే ఆదాయం వీటినుంచి మాత్రమే. ఈ వ్యక్తులు పాము మాంసం, ఇతర శరీర భాగాలు, దాని విషాన్ని మార్కెట్‌లో అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. పాము విషం బంగారం కంటే విలువైనది. అత్యంత ప్రమాదకరమైన పాము ఒక లీటర్ విషం ఖరీదు 3.5 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.

క్యాన్సర్‎కు సంబంధించిన మందులు
చైనాలో పాము మాంసాన్ని కూడా తింటారు. ఈ వ్యక్తులు లక్షల రూపాయలు సంపాదిస్తారు. భారతదేశంలో పనీర్ తినే విధంగా ఇక్కడ పాము మాంసం తింటారు. పాము కూర, దాని పులుసు ఇక్కడ అత్యంత ప్రాచుర్యం పొందాయి. అంతే కాకుండా పాముల భాగాలు ఔషధ తయారీకి ఎంతగానో ఉపయోగపడతాయి. క్యాన్సర్‌కు సంబంధించిన మందులు తయారు చేస్తారు. ఇక్కడ పాములను గాజు, చెక్క పెట్టెల్లో పెంచుతారు. అవి పెద్దయ్యాక వాటిని కబేళాకు తీసుకెళ్లేముందే వాటి విషాన్ని బయటకు తీస్తారు. వాటిని చంపిన తరువాత మాంసం, ఇతర అవయవాలు వేరు చేయబడతాయి. దీంతో పాటు వాటి చర్మాలను తీసి ఎండలో ఆరబెడతారు. వాటి మాంసాన్ని ఆహారం, ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. అయితే చర్మాన్ని ఖరీదైన బెల్టులు, ఇతర వస్తువులను తయారు చేస్తారు.

అసలు ఐడియా ఎలా వచ్చింది?
కొంతకాలం క్రితం యెంగ్ హాంగ్ చెంగ్ అనే రైతు ఇక్కడ నివసించేవాడు. ఒకరోజు అతను చాలా అనారోగ్యానికి గురయ్యాడు. పేదరికం కారణంగా అతను డబ్బును సేకరించలేకపోయాడు. ఈ సమయంలో అతను స్వయంగా నయం చేయడానికి ఒక అడవి పామును పట్టుకుని దాని నుండి ఔషధం తయారుచేశాడు. దీని తర్వాత పాములు మనుషులను చంపడమే కాకుండా దాని భాగాలతో తయారు చేసిన ఔషధం ద్వారా ప్రజల ప్రాణాలను కూడా రక్షించవచ్చని చెంగ్ భావించాడు. ఇవన్నీ చూసి పాముల పెంపకం ప్రారంభించి ఎంతో ప్రయోజనం పొందాడు. చెంగ్‌ను చూసి గ్రామంలోని ఇతర వ్యక్తులు కూడా పాములను పెంచడం ప్రారంభించారు. త్వరలోనే ఇక్కడి ప్రజలు ఈ పనిని తమ వృత్తిగా చేసుకున్నారు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా చైనా ప్రభుత్వం ఈ గ్రామంలో 6 నెలల పాటు పాము పెంపకాన్ని నిషేధించింది.

Read Also:Special Offer Passengers: అయ్.. ఒక్క రూపాయికే హైదరాబాద్‌ టు విజయవాడ ప్రయాణం.. కానీ..!