NTV Telugu Site icon

Snake: స్టేడియంలోకి స్నేక్ ఎంట్రీ.. మ్యాచ్కు అంతరాయం

Snake

Snake

మాములుగా క్రికెట్ మ్యాచ్ లు జరిగేటప్పుడు.. వర్షం వస్తే ఆపేస్తారు. వర్షం తగ్గాక తిరిగి ఆటను ప్రారంభిస్తారు. మరికొన్ని సందర్భాల్లో ఏవైనా జంతువులు స్టేడియంలోకి వస్తే.. కాసేపు ఆటను నిలిపివేస్తారు. అయితే లంక ప్రీమియర్ లీగ్ లో కూడా కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. కారణమేంటంటే.. ఓ స్నేక్ స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చింది. లంక ప్రీమియర్ లీగ్- 2023లో భాగంగా.. గాలె టైటాన్స్ మరియు దంబుల్లా ఆరా మధ్య మ్యాచ్ నడుస్తుండగా.. ఒక పాము మైదానంలోకి ప్రవేశించింది. దీంతో కాసేపు మ్యాచ్ ను ఆపేశారు.

Australian Beach Mystery: ఆస్ట్రేలియా ఒడ్డున భారత్‌ PSLV రాకెట్‌ భాగం.. ప్రకటించిన ఆస్ట్రేలియా స్పేస్‌ ఏజెన్సీ

దంబుల్లా జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాము ప్రవేశించింది. క్రీజులో ధనంజయ్ డిసిల్వా, కుశాల్ పెరీరా ఉన్నారు. ఇంతలోనే పాము మైదానంలోకి రాగానే.. కాసేపు మ్యాచ్ ను ఆపేశారు. సాధారణంగా గ్రౌండ్ లోకి కుక్క వస్తే దాన్ని తరిమికొట్టేందుకు గ్రౌండ్ స్టాఫ్ వస్తారు కానీ.. పామును బయటికి పంపించేందుకు ఎవరూ రాలేదు. అదృష్టవశాత్తూ పాము బౌండరీ బయటికి వెళ్లిపోయింది. దీనితో తిరిగి ఆటను ప్రారంభించారు.

Nee Jathai Song: ఏజెంట్ బ్యూటీతో మెగా ప్రిన్స్ రొమాన్స్

ఇంతకు ముందు కూడా స్టేడియంలోకి పాము ప్రవేశించిన సందర్భం ఉంది. ఇండియాలో కూడా మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. పాము మైదానంలోకి ప్రవేశించింది. గౌహతిలోని బార్‌స్పరా స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాము ఎంట్రీ ఇవ్వడంతో కాసేపు మ్యాచ్‌ను నిలిపివేశారు.