NTV Telugu Site icon

Indo china border: బంగారం అక్రమ రవాణా.. 108 కిలోల గోల్డ్ స్వాధీనం

Gold

Gold

భారత్-చైనా సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు ఇండో-చైనా సరిహద్దు సమీపంలో కిలోగ్రాము బరువున్న 108 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసినట్లు సరిహద్దు రక్షణ దళానికి చెందిన అధికారి ఒకరు తెలిపారు. భారీ మొత్తంలో స్మగ్లింగ్ చేసిన బంగారంతో పాటు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక బైనాక్యులర్, రెండు కత్తులు, కేకులు, పాలు వంటి పలు చైనీస్ ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారి వెల్లడించారు.

ఇది కూడా చదవండి: AP Crime: ఏపీలో దారుణం.. తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య..!

21వ బెటాలియన్ దళాలు మంగళవారం మధ్యాహ్నం తూర్పు లడఖ్‌లోని చాంగ్‌తాంగ్ సబ్ సెక్టార్‌లో చిజ్‌బులే, నార్బులా, జాంగిల్, జక్లాతో సహా స్మగ్లర్ల చొరబాట్లను తనిఖీ చేయడానికి లాంగ్ రేంజ్ గస్తీని ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. వాస్తవ నియంత్రణ రేఖకు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న శ్రీరాప్‌ల్‌లో స్మగ్లింగ్‌కు సంబంధించిన ఇన్‌పుట్‌లు ఐటీబీపీకి అందాయన్నారు. అనంతరం డిప్యూటీ కమాండెంట్ దీపక్ భట్ నేతృత్వంలోని పెట్రోలింగ్ నిర్వహించగా.. ఇద్దరు వ్యక్తులు మ్యూల్స్‌పై ఉండటాన్ని గమనించి తనిఖీ చేయగా గోల్డ్ బయటపడినట్లు పేర్కొన్నారు. అయితే వారు తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. వెంబడించి అరెస్టు చేసినట్లు అధికారి స్పష్టం చేశారు. మొదట వారు ఔషధ మొక్కల డీలర్లుగా పనిచేస్తున్నట్లు చెప్పినట్లు అధికారి పేర్కొన్నారు. వారి వస్తువులను సోదా చేయగా భారీ మొత్తంలో బంగారం, ఇతర వస్తువులు దొరికాయని వెల్లడించారు. ఐటీబీపీ చరిత్రలో ఇంత మొత్తంలో బంగారం దొరకడం ఇదే తొలిసారి అని.. స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను కస్టమ్స్ విభాగానికి అప్పగిస్తామని అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: Telangana DGP: తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ నియామకం