Indo china border: బంగారం అక్రమ రవాణా.. 108 కిలోల గోల్డ్ స్వాధీనం
- భారత్.. చైనా సరిహద్దులో భారీగా బంగారం పట్టివేత
- 108 కిలోల గోల్డ్ స్వాధీనం చేసుకున్న దళాలు
- కస్టమ్స్ అధికారులకు అప్పగిస్తామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-చైనా సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు ఇండో-చైనా సరిహద్దు సమీపంలో కిలోగ్రాము బరువున్న 108 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసినట్లు సరిహద్దు రక్షణ దళానికి చెందిన అధికారి ఒకరు తెలిపారు. భారీ మొత్తంలో స్మగ్లింగ్ చేసిన బంగారంతో పాటు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక బైనాక్యులర్, రెండు కత్తులు, కేకులు, పాలు వంటి పలు చైనీస్ ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: AP Crime: ఏపీలో దారుణం.. తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య..!
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
21వ బెటాలియన్ దళాలు మంగళవారం మధ్యాహ్నం తూర్పు లడఖ్‌లోని చాంగ్‌తాంగ్ సబ్ సెక్టార్‌లో చిజ్‌బులే, నార్బులా, జాంగిల్, జక్లాతో సహా స్మగ్లర్ల చొరబాట్లను తనిఖీ చేయడానికి లాంగ్ రేంజ్ గస్తీని ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. వాస్తవ నియంత్రణ రేఖకు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న శ్రీరాప్‌ల్‌లో స్మగ్లింగ్‌కు సంబంధించిన ఇన్‌పుట్‌లు ఐటీబీపీకి అందాయన్నారు. అనంతరం డిప్యూటీ కమాండెంట్ దీపక్ భట్ నేతృత్వంలోని పెట్రోలింగ్ నిర్వహించగా.. ఇద్దరు వ్యక్తులు మ్యూల్స్‌పై ఉండటాన్ని గమనించి తనిఖీ చేయగా గోల్డ్ బయటపడినట్లు పేర్కొన్నారు. అయితే వారు తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. వెంబడించి అరెస్టు చేసినట్లు అధికారి స్పష్టం చేశారు. మొదట వారు ఔషధ మొక్కల డీలర్లుగా పనిచేస్తున్నట్లు చెప్పినట్లు అధికారి పేర్కొన్నారు. వారి వస్తువులను సోదా చేయగా భారీ మొత్తంలో బంగారం, ఇతర వస్తువులు దొరికాయని వెల్లడించారు. ఐటీబీపీ చరిత్రలో ఇంత మొత్తంలో బంగారం దొరకడం ఇదే తొలిసారి అని.. స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను కస్టమ్స్ విభాగానికి అప్పగిస్తామని అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana DGP: తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ నియామకం
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?