భారత్-చైనా సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు ఇండో-చైనా సరిహద్దు సమీపంలో కిలోగ్రాము బరువున్న 108 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసినట్లు సరిహద్దు రక్షణ దళానికి చెందిన అధికారి ఒకరు తెలిపారు.