NTV Telugu Site icon

Smriti Mandhana: వాట్ ఏ క్యాచ్ స్మృతి.. వెనక్కు పరుగెత్తి ఎలా పట్టిందో చూడండి (వీడియో)

Smriti Mandhana

Smriti Mandhana

ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన అద్భుత క్యాచ్ పట్టింది. అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుకు ఆడుతున్న స్మృతి.. పెర్త్ స్కార్చర్స్ తో జరిగిన మ్యాచ్ లో అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాన్ని కనబర్చింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అభిమానుల మనసు గెలుచుకుంది స్మృతి మంధాన. కళ్లు చెదిరే రన్నింగ్‌ క్యాచ్‌ పట్టుకుంది. స్కార్చర్స్‌ ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ తొలి బంతికి లీసన్‌ కవర్స్‌ దిశగా షాట్‌ ఆడగా.. మిడ్‌ ఆఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మంధన వెనక్కు పరిగెడుతూ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ క్యాచ్‌పై అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also: Purandeswari: వికలాంగ క్రీడాకారిణికి ధైర్యం నింపిన ఎంపీ పురంధేశ్వరి

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పెర్త్ స్కార్చర్స్ మహిళా కెప్టెన్ సోఫీ డివైన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో స్మృతి మంధాన అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు నుంచి ఓపెనర్ గా బరిలోకి దిగింది. మంధాన 29 బంతుల్లో 41 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్ కొట్టింది. స్మృతి మంధాన ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌లలో 28.80 సగటుతో 144 పరుగులు చేసింది. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది.

Read Also: BJP: ఠాక్రే, రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారు.. శరద్ పవార్ మాటలే సాక్ష్యం..

ఈ మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మంధాన 41 పరుగులతో పాటు.. కేటీ మాక్ 34 బంతుల్లో 41, లారా వోల్వార్ట్ 28 బంతుల్లో 48 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పెర్త్‌ జట్టు 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేసింది. మేగాన్ స్కట్ అద్భుత బౌలింగ్‌తో 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది. దీంతో.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.

Show comments