భారత మహిళల క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా మహిళల జట్టు మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. అందులో భాగంగా.. ఈరోజు మొదటి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన షఫాలీ వర్మ కేవలం (7) పరుగులు చేసి నిరాశపరచగా.. స్మృతి మంధాన సెంచరీతో అదరగొట్టింది. 127 బంతుల్లో 117 పరుగులు చేసింది. ఆ తర్వాత.. దీప్తి శర్మ (37), పూజా వస్త్రాకర్ (31) పరుగులతో రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. సౌతాఫ్రికా జట్టు ముందు 266 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
Read Also: Black Jamun: నేరేడు పండ్లను తింటే ఇన్ని లాభాలా..
ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ, స్మృతి మంధాన కీలక ఇన్నింగ్స్ ఆడింది. మరోవైపు.. ఈ మ్యాచ్ లో స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో 7000 పరుగుల మార్క్‌ను దాటింది. అంతర్జాతీయ క్రికెట్‌లో మిథాలీ రాజ్ ఈ ఘనత సాధించన తర్వాత.. స్మృతి మంధానఈ ఘనత సాధించిన రెండో క్రీడాకారిణిగా నిలిచింది. అంతేకాకుండా.. మహిళా క్రికెట్‌లో ఓపెనర్‌గా 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల క్లబ్‌లో మంధాన చేరింది. న్యూజిలాండ్ క్రీడాకారిణి సుజీ బేట్స్ మహిళల వన్డే సిరీస్‌లో 32 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసింది. కాగా, షార్లెట్ ఎడ్వర్డ్స్ (28 సార్లు) రెండో స్థానంలో, మంధాన (27 సార్లు) మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం.. 226 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 5 ఓవర్లలో 21 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.
Read Also: Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై యువకుల రాళ్ల దాడి..