Site icon NTV Telugu

Smriti Mandhana: 45 రోజులుగా నిద్రలేని రాత్రులు.. ఎన్నో అనుభవించాం.. స్మృతి సంచలన కామెంట్స్..!

Smriti Mandhana

Smriti Mandhana

Smriti Mandhana: ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌లో 10,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన మిథాలీ రాజ్ గత తర్వాత ఆమె ఎదురుకున్న అనేక సందర్బాలను చెప్పుకొచ్చింది. ముఖ్యంగా 2025 నవంబర్ 2న భారత్ తన మొట్టమొదటి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న చారిత్రాత్మక సందర్భానికి గుర్తుచేసుకుంటూ.. ఆమె తన మనసులోని భావాలను పంచుకుంది.

బ్యాటరీ బాంబ్ పేల్చిన Realme.. 10,001mAhతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం..!

మహిళా ప్రపంచకప్ 2025 విజయం నాకు ఇంకా నమ్మశక్యంగా లేదు (Still sinking in). నేను సాధారణంగా క్రికెట్ మైదానంలో అంతగా భావోద్వేగానికి లోనుకాను. కానీ, ఇది చాలా అద్భుతమైన క్షణం. స్వదేశంలో ప్రపంచకప్ ఆడటం, భారత్‌లోనే ప్రపంచ ఛాంపియన్‌లుగా నిలవడం అనేది నా మనసు ఇంకా పూర్తిగా జీర్ణించుకోలేకపోతోందని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

అలాగే ఇదివరకు తాము ఆడిన ప్రతి వరల్డ్ కప్‌లో ఎన్నో గుండెకోతలు (Heartbreaks) అనుభవించామని.. కానీ మహిళల క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో మాకు పెద్ద బాధ్యత ఉందని మేము నమ్ముతూ ముందుకు సాగమని చెప్పుకొచ్చింది. గత 40 రోజులను నేను మాటల్లో వర్ణించలేనని.. ఈ వరల్డ్ కప్ గెలవడం కోసం గత 45 రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపినందుకు ఇప్పుడు ఏమాత్రం బాధగా లేదు.. ఆ కష్టమంతా ఈ విజయంతో మర్చిపోయానని చెప్పుకొచ్చింది.

Samsung Galaxy S26 సిరీస్ మొబైల్స్ కొనాలంటే పర్సులు ఖాళీ అవ్వాల్సిందేనా..!

అలాగే గత టీ20 వరల్డ్ కప్ ఓటమి మా అందరికీ చాలా కష్టంగా అనిపించింది. అందుకే ఈసారి మా ఫిట్‌నెస్‌పై, ప్రతి చిన్న విషయంలో మెరుగుపడటంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లో 4-0తో టీమిండియా ముందంజలో ఉంది.

Exit mobile version