Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana: భారత మహిళా క్రికెట్లో సరికొత్త శకం మొదలుకాబోతోంది. రాయ్‌పూర్‌లో జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో స్మృతి మంధాన భారత జట్టును పూర్తి స్థాయి కెప్టెన్‌గా నడిపించనుంది. ఆమెకు కెప్టెన్సీ కొత్తేమీ కాదు. ఇంతకుముందు కూడా మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఆమెకు ఉంది. కానీ ఇప్పుడు ఆమె భుజాలపై ఉన్న బాధ్యత వేరు, ఈ మ్యాచ్ ఆమె కెప్టెన్సీ కెరీర్లోనే ఓ కొత్త ఆరంభం కానుంది. మహిళా క్రికెట్లో కెప్టెన్ మారడం అనేది చాలా అరుదుగా జరిగే పరిణామం. ముఖ్యంగా 2012 తర్వాత ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2000 నుంచి 2012 మధ్య కాలంలో భారత్ ఆరుగురు వేర్వేరు కెప్టెన్ల ఆధ్వర్యంలో ఆడింది. కానీ గత 14 ఏళ్లలో మాత్రం కేవలం ఇద్దరే ఇద్దరు కెప్టెన్లు జట్టును నడిపించారు. వారిలో ఒకరు మిథాలీ రాజ్ కాగా, మరొకరు హర్మన్‌ప్రీత్ కౌర్. మిథాలీ రాజ్ 2022లో రిటైర్ అయ్యే వరకు వన్డేలు, టెస్టుల్లో జట్టును లీడ్ చేసింది. ఇక షార్టెస్ట్ ఫార్మాట్లో 2016లో పగ్గాలు చేపట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్.. నాలుగేళ్ల కిందట పూర్తి స్థాయి కెప్టెన్ అయ్యింది. ఆమె నాయకత్వంలోనే భారత్ చారిత్రాత్మక వన్డే ప్రపంచ కప్ విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు సమయం మారడంతో జట్టులో మార్పులు రావాల్సిన అవసరం ఏర్పడింది. అలా వరుసగా రెండు టీ20 ప్రపంచ కప్‌లలో జట్టు లీగ్ దశలోనే వెనుదిరగడంతో.. ఇప్పుడు ఆ బాధ్యతలను 30 ఏళ్ల దిగ్గజ ఓపెనర్ స్మృతి మంధానకు అప్పగించారు.
శుక్రవారం రాయ్‌పూర్‌లో ఫుల్ టైమ్ కెప్టెన్‌గా తొలిసారి మైదానంలో అడుగుపెట్టనుంది మంధాన. గతంలో కూడా తాను చెప్పినట్లుగానే, టీ20ల్లో భారత్ లోపాలను ఆమె ఎప్పుడూ దాచుకోలేదు, కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంగా మాట్లాడుతుంది. “గత రెండు టీ20 ప్రపంచ కప్‌లలో మేము అర్హత సాధించలేకపోయాం. మేమందరం బాగానే ప్రిపేరై అక్కడికి వెళ్లామని భావించినా, ఇది మా అందరినీ తీవ్రంగా బాధించింది. అయితే టీ20 క్రికెట్లో ఫిట్నెస్, ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ మనకు ఇంకా కావాల్సింది ఏంటో స్పష్టంగా తెలుసు. మనం ఏమీ తక్కువ కాదని, బాగున్నామని నేను అనను, మనం మంచివారమే. కానీ ఆఖరి మెట్టుపై మరో పది శాతం మెరుగుదల అవసరం ఉంది” అని మంధాన చెప్పింది. “ఈ విషయం మన అమ్మాయిలందరికీ బాగా తెలుసు, మేమందరం దానికోసమే కష్టపడుతున్నాం. ఇదొక చక్కటి యువ జట్టు, వీళ్లతో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. గత మూడు రోజుల్లో నేను గమనించిన దాని ప్రకారం.. ప్రతి ఒక్కరూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విషయంలో ఎంతో నిబద్ధతతో ఉన్నారు” అని మ్యాచ్‌కు రెండు రోజుల ముందు స్మృతి మంధాన తెలిపింది. నిజానికి మ్యాచ్‌కు ముందు రోజు విలేకరుల సమావేశం జరగాల్సి ఉండగా, మంధాన బుధవారమే మీడియా ముందు మాట్లాడింది. ఆ తర్వాత రోజు జట్టు న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లింది.
Also Read
- Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
- South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
ఇక, గత వారం బీసీసీఐ పెద్దలతో జరిగిన సమావేశం తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ తన రాజీనామా సమర్పించడంతో.. ఆ తర్వాత మంధానను కెప్టెన్‌గా ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ ఎలా జరిగాయో మంధాన చాలా స్పష్టంగా వివరించింది. “మీ అందరికీ ఏ రోజు అయితే ఈ విషయం తెలిసిందో, నాకూ అదే రోజు తెలిసింది. ఆ సమావేశంలో చర్చంతా భారత క్రికెట్‌ను ముందుకు ఎలా తీసుకెళ్లాలి, రాబోయే రెండు మూడు సంవత్సరాలలో మన విధానం ఎలా ఉండాలి అనే దాని గురించే జరిగింది. ఎందుకంటే మనకు ముందు ముందు చాలా పెద్ద టోర్నమెంట్లు ఉన్నాయి. కౌర్ గత 10 ఏళ్లుగా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆమెకు అపారమైన అనుభవం ఉంది, జట్టులో చాలా సీనియర్ ఆటగాళ్లు ఆమెకు మద్దతుగా ఉంటారు. భారత క్రికెట్ అభివృద్ధి కోసం, భవిష్యత్తులో మనం బాగా రాణించడానికి ఏమేం చేయాలో ఆ సమావేశంలో చర్చించాము” అని మంధాన వెల్లడించింది.
కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడం తన బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేస్తుందని మంధాన నమ్ముతోంది. “నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడే నా కోచ్ ఒక మాట చెప్పారు. ‘నువ్వు బ్యాటింగ్‌కి వెళ్లినప్పుడల్లా నువ్వే కెప్టెన్ అనుకో’ అని చెప్పారు. ఎందుకంటే అలా అనుకున్నప్పుడే ఆ బాధ్యత మనకు అలవడుతుంది. ఆ పద్ధతిలో ఇప్పుడూ ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ బాల్ నా జోన్లోనే పడితే, జట్టుకు ఏది అవసరమో దానికోసమే నేను ఆడుతూనే ఉంటానని” ఆమె తేల్చి చెప్పింది. తనదైన దూకుడు స్వభావాన్ని బ్యాటింగ్‌లో కొనసాగిస్తానని మరోసారి స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!