Site icon NTV Telugu

Smriti Irani: రాహుల్ పై స్మృతి ఇరాని ఫైర్.. నువ్వేమైన ప్రధాని అభ్యర్థివా..?

Nilesh Kumbhani (3)

Nilesh Kumbhani (3)

సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్డీఏ, ఇండియా కూటమి నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీజేపీ నాయకురాలు, ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరాని ఫైర్ అయ్యారు. ఎన్నికల అంశాలపై ప్రధాని మోడీతో బహిరంగా చర్చకు తాను సిద్ధమని రాహుల్‌ తరచూ ప్రకటిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో స్మృతి ఇరాని కౌంటర్ వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చించడానికి రాహుల్‌ గాంధీ ఏమైనా విపక్షాల కూటమికి ప్రధాని అభ్యర్థిగా ఉన్నారా? అని ప్రశ్నించారు. తమ కంచుకోటలా భావించే నియోజకవర్గంలో ఓ సాధారణ బీజేపీ కార్యకర్తపై కూడా పోటీ చేసే ధైర్యం లేని వ్యక్తి ప్రగల్భాలు పలకడం మానుకోవాలని సూచించారు. ఇక ప్రధానితో భేటీ అయి, ఆయనతో డిబేట్‌ చేసే స్థాయి రాహుల్‌కి ఉందా అంటూ ఎద్దేవా చేశారు.

READ MORE: India-China: చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుదలపై విదేశాంగ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ చర్చల వల్ల తమ పార్టీ విజన్‌ను ప్రజలు అర్థం చేసుకునేందుకు వీలుంటుందని.. సరైన సమాచారం ప్రజలకు చేరుతుందని రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ చర్చకు తాను కానీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కానీ పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఓ వేదికపై బహిరంగ చర్చకు రావాలని ద హిందూ మాజీ సంపాదకుడు ఎన్‌ రామ్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ లోకూర్‌, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఏపీ షాలు మూడు రోజుల క్రితం నేతలిద్దరికి లేఖలు రాశారు. వాణిజ్యేతర, పార్టీయేతర వేదికపై ఈ చర్చను జరపాలని, ఇలాంటి బహిరంగ చర్చ కారణంగా ప్రజలకు అవగాహన ఏర్పడటమే కాకుండా ఒక ఆరోగ్యకరమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని ప్రదర్శించడంలో గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. ఒకసారి ఇరు నేతలు ఆలోచించాలని సూచించారు.

Exit mobile version