SMK Helmets: ఎనర్జీ ఇంపాక్ట్ రెసిస్టెంట్ థర్మోప్లాస్టిక్ షెల్‌ తో.. SMK నోవా సాలిడ్, ట్రాక్ హెల్మెట్స్ రిలీజ్

  • SMK నోవా సాలిడ్, ట్రాక్ హెల్మెట్స్ రిలీజ్
  • SMK నోవా సాలిడ్ సిరీస్ ధర రూ. 4,000
  • నోవా ట్రాక్, రూ. 4,300కి ప్రారంభించారు
Smk Nova Helmets

Smk Nova Helmets

భారత్ లో ప్రతి నెలా వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ సంఖ్యలో బైక్ ప్రమాదాలున్నాయి. అనేక ప్రమాదాలలో గాయాలకు ప్రధాన కారణం హెల్మెట్లు ఉపయోగించకపోవడమే. ప్రమాదాలను తగ్గించడానికి, ఎల్లప్పుడూ సురక్షితమైన, మంచి నాణ్యత గల హెల్మెట్‌ను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు. కంపెనీలు సైతం వాహనదారుల భద్రత కోసం క్వాలిటీ హెల్మెట్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా స్టడ్స్ ప్రీమియం బ్రాండ్ SMK భారతదేశంలో ప్రీమియం హెల్మెట్ విభాగంలో SMK నోవా సాలిడ్, నోవా ట్రాక్ అనే రెండు కొత్త సిరీస్‌లను విడుదల చేసింది.

Also Read:Chiranjeevi: డిజిటల్ తెరపై మెగా రికార్డు! ఓటీటీలో ఒక్కరోజులోనే సరికొత్త చరిత్ర సృష్టించిన మెగాస్టార్..

రెండు కూడా XS, S, M, L, XL, XXL పరిమాణాలలో, అలాగే గ్లోస్, మ్యాట్ ఫినిషింగ్‌లలో వస్తున్నాయి. ప్రీమియం హెల్మెట్ విభాగంలో, SMK నోవా సాలిడ్ సిరీస్ ధర రూ. 4,000. దీని రెండవ సిరీస్, నోవా ట్రాక్, రూ. 4,300కి ప్రారంభించారు. రెండు కొత్త సిరీస్ లు ఎనర్జీ ఇంపాక్ట్ రెసిస్టెంట్ థర్మోప్లాస్టిక్ (EIRT) షెల్‌ తో రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇది అత్యుత్తమ ఇంపాక్ట్ రెసిస్టెన్స్, మన్నికను అందిస్తుంది. మల్టీ-డెన్సిటీ EPS లైనర్ ఇంపాక్ట్ ఎనర్జీని సమర్థవంతంగా గ్రహిస్తుంది, రక్షణను అందిస్తుంది. ఈ హెల్మెట్‌లు ECE 22.06, DOT, ISI సర్టిఫికేషన్‌తో వస్తున్నాయి.