Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smart Money Rules to Build Wealth: నేటి వేగవంతమైన జీవనశైలిలో సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించిన డబ్బును తెలివిగా ఖర్చు చేయడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా నగరాల్లో నివసించే ఉద్యోగ దంపతులకు కుటుంబ అవసరాలు, పిల్లల భవిష్యత్తు, రోజువారీ ఖర్చులు, పెట్టుబడులు వంటి అంశాల మధ్య సమతుల్యత సాధించడం పెద్ద సవాలుగా మారుతోంది. అయితే కొన్ని ఆర్థిక సూత్రాలు ప్రతి కుటుంబానికి చాలా అవసరం. మరి ఆ కీలక ఆర్థిక నియమాలు ఏంటో చూసేద్దామా..
Rule 1: ఆడంబరాలకు కాస్త దూరంగా..
చాలామంది ఇతరులను ఆకట్టుకోవడానికి ఖరీదైన కార్లు, బ్రాండెడ్ దుస్తులు, విలాసవంతమైన వస్తువులపై అధికంగా ఖర్చు చేస్తుంటారు. కానీ ఆర్థికంగా స్థిరపడాలంటే అలాంటి ఆడంబరాల కంటే కుటుంబానికి నిజంగా అవసరమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి నివాసం, ప్రశాంతమైన వాతావరణం, కుటుంబ సౌకర్యాలు వంటి వాటిపై ఖర్చు చేయడం దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది.
Also Read
- Wheat Flour Soup Recipe: చలికాలానికి బెస్ట్ డిన్నర్.. రొట్టెలకు బదులుగా హెల్తీ ఫుడ్.. 10 నిమిషాల్లో రెడీ!
- Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
- Asaduddin Owaisi: ముస్లిం వ్యక్తే డిప్యూటీ సీఎం..!
- Minister Sridhar Babu: వర్గల్లో‘వింటేజ్ కాఫీ’ ప్లాంట్.. వేయి మందికి కొత్తగా ఉపాధి..
Rule 2: వస్తువుల కంటే జీవితాంతం గుర్తుండే జ్ఞాపకాలు:
కొత్త వస్తువులు కొనడం కన్నా కుటుంబంతో కలిసి మంచి అనుభవాలను సృష్టించుకోవడం ఎంతో విలువైనది. ప్రతి సంవత్సరం ఒక అంతర్జాతీయ పర్యటన, చిన్న చిన్న విహారయాత్రలు (Staycations), పండుగల సమయంలో తల్లిదండ్రులను కలవడం వంటి అనుభవాల కోసం ఖర్చు చేస్తే కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. డబ్బుతో కొన్న వస్తువులు పాతబడిపోతాయి. కానీ, జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం మనతోనే ఉంటాయి.
Rule 3: ఆరోగ్యమే అసలైన సంపద:
ఆరోగ్యకరమైన జీవితం కోసం చేసే ఖర్చు ఎప్పుడూ వృథా కాదు. మంచి ఆహారం, వ్యాయామం, జిమ్ మెంబర్‌షిప్‌లు, నాణ్యమైన ఆరోగ్య ఉత్పత్తులపై పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో వచ్చే భారీ వైద్య ఖర్చులను తగ్గించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన శరీరమే జీవితంలో చేసే అత్యంత ముఖ్యమైన పెట్టుబడి.
Rule 4: లక్ష్యాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా పెట్టుబడులు:
పెట్టుబడులు ఎప్పుడూ ఒక స్పష్టమైన లక్ష్యంతో ఉండాలి. ప్రతి ఏడాది గత ఏడాదికంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టే అలవాటు ఆర్థిక భద్రతను పెంచుతుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని స్టాక్ మార్కెట్లు (NSE, BSE), మ్యూచువల్ ఫండ్లలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి సంపదను సృష్టించుకోవచ్చు. ఇంటి ముందు నిలిపే ఖరీదైన కారు కంటే పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో పెరుగుతున్న విలువే నిజమైన ఆర్థిక భద్రతను ఇస్తుంది.
Rule 5: ఖర్చులను పంచుకోండి:
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే కుటుంబ ఖర్చులను కూడా సమానంగా పంచుకోవడం ఉత్తమ పద్ధతి. ఇలా చేయడం వల్ల ఒక్కరిపై ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. ఉదాహరణకు భార్య ఇంటి అద్దె, విద్యుత్ బిల్లు, ఇతర నెలవారీ స్థిర ఖర్చులను చూసుకుంటే.. భర్త కిరాణా సరుకులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, ప్రయాణ ఖర్చులు వంటి ఇతర వ్యయాలను నిర్వహించవచ్చు. ఇలా బాధ్యతలను పంచుకోవడం వల్ల ఆర్థిక ఒత్తిడి తగ్గడమే కాకుండా కుటుంబ ఆర్థిక వ్యవస్థ కూడా క్రమబద్ధంగా ఉంటుంది.
ప్రతి కుటుంబ పరిస్థితి ఒకేలా ఉండదు. అందువల్ల ఈ ఆర్థిక సూత్రాలు అందరికీ యథాతథంగా వర్తించకపోవచ్చు. అయినప్పటికీ, అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆరోగ్యంపై పెట్టుబడి పెట్టడం, క్రమం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్లు చేయడం, ఖర్చులను సమతుల్యంగా నిర్వహించడం వంటి అలవాట్లు దీర్ఘకాలంలో ఆర్థిక స్వేచ్ఛను, భవిష్యత్తుపై భరోసాను కల్పిస్తాయి. చిన్న చిన్న ఆర్థిక నిర్ణయాలే భవిష్యత్తులో పెద్ద మార్పుకు బాటలు వేస్తాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
Wheat Flour Soup Recipe: చలికాలానికి బెస్ట్ డిన్నర్.. రొట్టెలకు బదులుగా హెల్తీ ఫుడ్.. 10 నిమిషాల్లో రెడీ!
-
Kenishaa : జయం రవి వివాదంలో బిగ్ ట్విస్ట్.. ఆ రోజు కోర్టుకు రాకపోతే అంతే!
-
Asaduddin Owaisi: ముస్లిం వ్యక్తే డిప్యూటీ సీఎం..!
-
Alias Rukmini : అమ్మాయి పేరుతో నితిన్ ‘కోరికలే గుర్రాలైతే’ పుస్తకాలు! ‘అలియాస్ రుక్మిణీ’ ట్రైలర్ అదిరిందిగా!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!